Home Cinema Tamannaah: తను ఇంత తెల్లగా ఉండటానికి ఎం వాడుతుందో చెప్పేసిన తమన్నా..

Tamannaah: తను ఇంత తెల్లగా ఉండటానికి ఎం వాడుతుందో చెప్పేసిన తమన్నా..

Tamannaah: సౌత్ లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్నా పేరు కచ్చితంగా ఉంటుంది. మంచు మనోజ్ హీరో గా నటించిన ‘శ్రీ’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె, ఆ తర్వాత తమిళం లో ‘కేడి’ అనే చిత్రంతో పూర్తి స్థాయి నెగటివ్ రోల్ తో తమిళ ప్రేక్షకులను పలకరించింది. నెగటివ్ రోల్ తో పరిచయమైనప్పటికీ ఈమెకి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి(Tamannaah Fairness). ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీ డేస్’ చిత్రం తో కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న తమన్నా కి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

tamannaah-fairness-secret

వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు సంపాదిస్తూ అతి తక్కువ సమయం లోనే సూపర్ స్టార్ గా ఎదిగిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో ఎంతో మంది హీరోయిన్స్ వచ్చినప్పటికీ తమన్నా క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఆమె స్క్రీన్ మీద కనిపించింది అంటే పక్కన ఎంత పెద్ద ఆర్టిస్టు ఉన్నా మనకి కనిపించడు, కేవలం తమన్నా మాత్రమే కనిపిస్తుంది, అంత గొప్ప అందం ఆమె సొంతం. ఇకపోతే ఈమె రీసెంట్ గా తన శరీర చర్మం అంత తెల్లగా మెరిసిపోవడానికి గల కారణం ని చెప్పుకొచ్చింది(Tamannaah Fairness). ప్రతీ రోజు ఆమె బ్రేక్ ఫాస్ట్ గా నట్ ఫ్రూప్ట్స్ తీసుకుంటుందట.

అలాగే మధ్యాహ్నం భోజనం కి మనలాగా తెల్లని రైస్ కాకుండా, బ్రౌన్ రైస్ తీసుకుంటుందట. అందులో కూరలు కలుపుకొని తింటుందట. మళ్ళీ డిన్నర్ ఆమె సాయంత్రం 5 గంటలకే పూర్తి చేస్తుందట. ఉదయం వరకు మంచి నీళ్లు తప్ప వేరే ఆహారం ఏమి తీసుకోదట. అలా చెయ్యడం వల్లే ఈరోజు ఆమె ఇంత తెల్లగా నిగనిగలాడిపోతోంది. అంటే మనమంతా అందంగా ఉండాలంటే 12 గంటలు కడుపు మాడ్చుకోవాలి అన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తమన్నా లాగా మీరు కూడా ఉంటారేమో చూద్దాం. ఇకపోతే తమన్నా ప్రస్తుతం అడల్ట్ వెబ్ సిరీస్ లతో సోషల్ మీడియా లో ప్రకంపనలు పుట్టించిన సంగతి అందరికీ తెలిసిందే.

అంతే కాకుండా రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘జైలర్’ లో కూడా ముఖ్యమైన పాత్ర పోషించి మంచి గుర్తింపు ని దక్కించుకుంది. ఏదిఏమైనా తమన్నా పని ఐపోయింది అని అనుకున్న ప్రతి ఒక్కరికి పెద్ద ట్విస్ట్ ఆ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ, లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో ఆలా అన్న వారి నోరు మూయించింది. ఆ నటి ఇవ్వలేనటువంటి కం బ్యాక్ ఇచ్చింది తమ్ము బేబీ.

ఈ సిరీస్ చేసినప్పటి నుండి అమ్ముడికి తెగ ఆఫర్ లు వస్తున్నాయి. మొన్నటి వరకు రాని ఆఫర్లు ఏంటి ఇపుడు ఇలా వస్తున్నాయి అని తమన్నా నే అవాక్ అయ్యేలా వస్తున్నాయి. డైరెక్టర్ లకి తమన్నా అందాన్ని చూసి ఫిదా ఐపోయారు అంటారా..

Exit mobile version