Home Cinema Tamannaah-Trisha: తమన్నా త్రిషతో ఒకేసారి రొమాన్స్ చేయనున్న ఆ లక్కీ స్టార్ హీరో ఎవరంటే..

Tamannaah-Trisha: తమన్నా త్రిషతో ఒకేసారి రొమాన్స్ చేయనున్న ఆ లక్కీ స్టార్ హీరో ఎవరంటే..

Tamannaah-Trisha: మిళనాడు లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకడు అజిత్. ఈయనకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కోలీవుడ్ లో ఏ స్టార్ హీరో కి కూడా లేదని అందరూ అంటుంటారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన అజిత్ కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న రోల్స్ వేసుకుంటూ హీరో గా ఎదిగిన వారిలో ఒకరు. అక్కడి యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తున్న అజిత్ నుండి గత కొంతకాలం గా సరైన బ్లాక్ బస్టర్ హిట్ రావడం లేదు.

Tamannaah-trisha-ajith

అయితే టాక్ రాకపోయినా కూడా అజిత్ సినిమాలు చాలా అవలీలగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘తూనీవు’ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు అజిత్ రీసెంట్ గా తిరుమనేని దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష మరియు తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒకే సినిమాలో ఎప్పుడూ కూడా నటించలేదు. ఇన్నాళ్లు ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ ఈ హాట్ బ్యూటీలను ఒకే స్క్రీన్ పై చూసే అదృష్టం ఎవరికీ దక్కలేదు.

అయితే ఇప్పుడు తొలిసారి ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించబోతుండడం, అది కూడా అజిత్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమాలో అంటే అభిమానులకు ఇక కనుల పండుగే అని చెప్పొచ్చు. తొలుత ఈ సినిమాకి నయనతార భర్త విగ్నేష్ దర్శకత్వం వహించాల్సి ఉంది(Tamannaah-Trisha). కానీ విగ్నేష్ ఇచ్చిన న్యారేషన్ అజిత్ కి ఏమాత్రం కూడా నచ్చలేదు. దీంతో ఆయన ఆయన ఈ సినిమా నుండి తప్పుకోగా, తిరుమనేని ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టాడు.

ప్రస్తుతం అజిత్ హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ట్రిప్ అయిపోగానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ చిత్రం లో అజిత్ చాలా స్టైలిష్ లుక్స్ తో కనిపిస్తాడట. అజిత్ తన ప్రతీ సినిమా లో కూడా తెల్ల జుట్టుతో సాల్ట్ & పెప్పర్ లుక్ లో కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ చిత్రం లో మాత్రం నల్లని జుట్టుతో కనిపిస్తాడట, ఇది అభిమానులకు పండుగ లాంటి వార్త అనే చెప్పాలి.

Exit mobile version