Thanikella Bharani: టాలీవుడ్ లో నవరసాల్లో ఏ రసాన్ని అయినా అవలీలగా పండించే క్యారక్టర్ ఆర్టిస్ట్స్ చాలా మంది ఉన్నారు. అసలు మన ఇండస్ట్రీ లో ఉన్నటువంటి మహానటులు ఏ ఇండస్ట్రీ లో కూడా లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్రలు వేసి ఇప్పటికీ ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ తో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో ఒకరు తనికెళ్ళ భరణి. విలనిజం అయినా,సెంటిమెంట్ అయినా, కామెడీ అయినా, ఈయన నటించడు జీవిస్తాడు. రచయితగా కెరీర్ ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత చిన్నగా సినిమాల్లో పాత్రలు దక్కించుకుంటూ,
అనతి కాలం లోనే స్టార్ రేంజ్ కి ఎదిగాడు. ముఖ్యంగా ‘ఆమె’ సినిమాలో ఈయన పోషించిన విలన్ పాత్ర ని చూసి బయట తిరుగుతున్నప్పుడు ఆడవాళ్లు ఈయనని కొట్టడానికి వచ్చేవారట. అంత అద్భుతంగా నటించాడు ఆయన. అలాంటి పాత్రలు కెరీర్ లో ఎన్నో ఉన్నాయి ఆయనకీ(Thanikella Bharani). రచయితగా, నటుడిగా మాత్రమే కాదు, దర్శకుడిగా కూడా ఆయన విజయాలు చూసాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో చోటు చేసుకున్న కొన్న సంఘటనలను చెప్పుకొచ్చాడు.
అవి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. యాంకర్ తనికెళ్ళ భరణి ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు ఇప్పుడే ఇంత పుష్టి గా ఉన్నారు..టీనేజ్ లో పెద్ద అందగాడు అయ్యుంటారు కదా. మంచి పొడవు, అందం తో పాటుగా మంచి కటౌట్ కూడా ఉంది మీకు,మిమల్ని చాలా మంది అమ్మాయిలు ప్రేమించి ఉంటారు కదా’ అని అడగగా, దానికి తనికెళ్ళ భరణి సమాధానం చెప్తూ ‘5 మంది హీరోయిన్లు నన్ను ప్రేమించారు. ప్రతీ రోజు వాళ్ళ ఇంటి నుండి క్యారేజ్ బాక్సులు నా కోసం తెచ్చేవారు. నాతో మాటలు కలపడానికి ఎదో ఒక సాకు పెట్టుకొని వచ్చేవాళ్ళు. నాకు కావాల్సినవి కొనిచ్చేవారు.
నాకు చాలా లవ్ లెటర్స్ కూడా రాసారు, అవన్నీ ఇప్పటికీ భద్రంగా దాచిపెట్టుకున్నాను. మా ఆవిడ ఆ లెటర్స్ చదివి, ఇంత అందమైన అమ్మాయిలు మిమల్ని ప్రేమించారు కదా, మీరెందుకు నన్నే పెళ్లి చేసుకున్నారు అని అడిగేది’ అంటూ తనికెళ్ళ భరణి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ నువ్వు కూడా మంచి రసికుడివే అంటూ తనికెళ్ళ భరణి పై కామెంట్స్ చేస్తున్నారు. వయసు పెరగటంతో ఈ మధ్య సినిమాలల్లో ఎక్కువగా కనిపించటం లేదు తనికెళ్ల భరణి. లేటెస్ట్ గా అయన చేస్తున్న సినిమా బ్రో. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు.