Home Cinema Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 వాయిదా అవ్వడానికి కారణం ఇదే.. ఆగ్రహంలో...

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 వాయిదా అవ్వడానికి కారణం ఇదే.. ఆగ్రహంలో ఫాన్స్..

Pushpa 2 : అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా గురించి గత కొద్దీ రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. సోషల్ మీడియాలో సినిమా వాయిదా పై వచ్చే న్యూస్ లపై పుష్ప 2 టీం స్పందించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో పుష్ప సినిమాతో ఐకాన్‌ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా వాయిదా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. సోషల్ మీడియాలో పోస్ట్ కూడా షేర్ చేసారు.

ఈ చిత్రం కొత్త పోస్టర్‌ ప్రకారం డిసెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. ఆగస్ట్ 15న పుష్ప 2ని థియేటర్లలో విడుదల చేయడం లేదని కన్ఫర్మ్ అయింది. అయితే దీనికి కారణం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో విభేదాలే అంటున్నారు నెటిజనులు. సోషల్ మీడియాలో మెగా అభిమానులు అల్లు అర్జున్‌ని ఇలా ట్రోల్ చేస్తున్నారు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ తమ పోస్ట్‌లో సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాల్సి ఉంటుందని, అదే సినిమా ఆలస్యం కావడానికి కారణమని పేర్కొన్నారు.

these-are-the-reasons-behind-allu-arjun-pushpa-2-postpone

కారణాలు ఏమైనప్పటికీ, బడా పాన్ ఇండియా చిత్రంని కేవలం రెండు నెలల ముందు పోస్ట్ ఫోన్ కావడం చాలా షాకింగ్. అల్లు అర్జున్ ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఇదే. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ సినిమాను చూడాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ అభిమానులు చల్లబడ్డారు. ఇదిలా ఉంటె ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలను విడుదల చేసారు. మరికొన్ని పాటలైనా ఈ గ్యాప్ లో విడుదల చేయాలనీ కోరుకుంటున్నారు.

Exit mobile version