Vithika Sheru : చాలా కాలం బ్రేక్ తర్వాత వరుణ్ సందేశ్ నిందా అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో వరుణ్ హిట్ కొట్టనున్నాడని తెలుస్తోంది. ఇది కాండ్రకోటలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నిందా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రాజేష్ జగన్నాధం నిర్మించి దర్శకత్వం వహించారు. జూన్ 21న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు చెప్పిన మాటలు హైలైట్‌గా నిలిచాయి. తన సినిమా కార్యక్రమాలకు ప్రతిసారీ నన్ను రామాన్ని వరుణ్ సందేశ్ పిలుస్తాడు. కానీ నాకు ఇదొక పని ఉండడం వలన నేను రాలేకపోయాని. అయితే ఈ సినిమా నేను చూసాను. నాకు నిందా సినిమా బాగా నచ్చింది. అందుకే ఎలాగైనా ప్రొమోషన్స్ కు రావాలని ఉందని చెప్పింది. తన భర్తకు తగిన ఆఫర్లు రావడం లేదని బాధపడ్డారు వితిక.
గత 17 ఏళ్లుగా ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో నటిస్తుంటే ఫెయిల్ యాక్టర్ ఎలా అవుతాడు. ఏదో ఒకరోజు గట్టిగా కొడతానని, స్టార్ స్టేటస్ ను అందుకుంటాడని వితిక అన్నారు. ఈ సినిమాకు అతిధి గా విచ్చేసిన నిఖిల్ కూడా ఈ సినిమా టీజర్ బాగుందని అందరు తప్పని సరిగా ఈ సినిమాను చూడాలని ఆయన కోరారు. వరుణ్ సందేశ్ అసలు తన సినిమా ప్రోమోట్ చేయదు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని, లేకపోతే స్టేజ్‌పై కొడతానని నిఖిల్ చెప్పాడు.