Home Cinema Tollywood Heros: తెలుగు చదవటం రాయటం రాని టాలీవుడ్ హీరోలు వీళ్లే..

Tollywood Heros: తెలుగు చదవటం రాయటం రాని టాలీవుడ్ హీరోలు వీళ్లే..

Tollywood Heros: ఇతర రాష్ట్రాల్లో భాషకి ఇచ్చే విలువ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉదాహరణకి తమిళం మరియు కన్నడ ప్రజలను తీసుకంటే వాళ్ళ బాష కోసం ప్రాణాలు అయినా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి భావం ఎవరిలోనూ ఉండదు. చివరికి కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరోలు కూడా. అప్పట్లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై లో ఉండేది, చిన్నప్పటి నుండి స్టార్ హీరోలు వారి కొడుకులను అక్కడే చదివించుకునే వారు. ఫలితంగా వారికి తెలుగు కంటే కూడా తమిళమే ఎక్కువగా వంటపట్టింది.

tollywood-heros-who-dont-know-how-to-write-and-read-telugu

ఉదాహరణకి సూపర్ స్టార్ మహేష్ బాబు కి తెలుగు చదవడం, రాయడం రాదు. ఈ విషయం స్వయంగా అనే తెలిపాడు. స్కూల్ చదువు మొత్తం చెన్నై లో, ఆ తర్వాత పై చదువు మొత్తం ఫారిన్ లో పూర్తి చేసుకున్న మహేష్ బాబు కి తెలుగు మాట్లాడడం మాత్రమే వచ్చు. అక్కినేని నాగార్జున పరిస్థితి కూడా ఇంతే, ఈయనకి కూడా తెలుగు చదవడం, రాయడం రాదు(Tollywood Heros). అందుకే సినిమా షూటింగ్ లో తెలుగు డైలాగ్స్ ని మొత్తం ఇంగ్లీష్ లో రాయించుకొని చెప్తాడట. ఇక ఆ తర్వాత ఆయన కొడుకు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ కి కూడా ఇదే సమస్య తో ఇబ్బంది పడుతున్నారు.

ఇలా వీళ్లకు తెలుగు ఆడియన్స్ ప్రేమాభిమానాలు కావాలి, వాళ్ళు ఇచ్చే వసూళ్లు కావాలి కానీ, తెలుగు బాష మాత్రం నేర్చుకోవడం ఇష్టం లేదు అన్నమాట అని అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. వీళ్లందరిది ఒక ఎత్తు అయితే డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి విషయం మరొక ఎత్తు. ఈమెకి తెలుగు చదవడం, రాయడమే కాదు, మాట్లాడడం కూడా రాదు. ఇప్పటికీ ఆమె తెలుగు ఇంగ్లీష్ యాసలోనే ఉంటుంది. ఆమెకి నిజంగా తెలుగు రాదో, లేకపోతే స్టైల్ కోసం అలా మాట్లాడుతుందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు.

మంచు విష్ణు కి కూడా తెలుగు పూర్తిగా రాదు, మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ ఎన్నికల సమయం లో ఆయన మాట్లాడిన తెలుగు ఏ రేంజ్ లో ట్రోల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇలా తెలుగు వాళ్ళు అయ్యుండి కూడా తెలుగు నేర్చుకోకపోవడం అనేది ఎంత మాత్రం సహించదగినది కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version