Home Cinema Rana-Mahesh: మహేష్ బాబు మాట విని వందల కోట్లు నష్టపోయిన రానా..

Rana-Mahesh: మహేష్ బాబు మాట విని వందల కోట్లు నష్టపోయిన రానా..

Rana-Mahesh Babu: సౌత్ ఇండియా ని మాత్రమే కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాలలో ఒకటి ‘గజినీ’. AR మురగదాస్ దర్శకత్వం లో సూర్య హీరో గా నటించిన ఈ సినిమా 2004 వ సంవత్సరం లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను దక్కించుకొని చరిత్ర తిరగరాసింది. ఇదే సినిమాని తెలుగు లో దబ్ చేసి విడుదల చెయ్యగా ఇక్కడ కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది(Rana Lost Money). ఈ సినిమా తర్వాత సూర్య కి తెలుగు లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో సమానమైన క్రేజ్ వచ్చింది.

rana-lost-100s-crores-money-after-doing-whaat-mahesh-babu-said

ఎప్పుడొచ్చినా క్రేజ్, మార్కెట్ మన తెలుగులో సూర్య కి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సినిమాని ముందుగా తెలుగు లో రీమేక్ రైట్స్ కొని ఎవరో ఒక హీరో తో చెయ్యడానికి ఆసక్తి చూపిస్తూ ఉండేవాడట. తన తండ్రి సురేష్ బాబు ని రీమేక్ రైట్స్ కొనమని తెగ మారం చేసేవాడట. సురేష్ బాబు అప్పుడు రానాకీ సర్ది చెప్తూ ‘ఈ సినిమా చాలా బాగుంది మన తెలుగు హీరోలు ఇలాంటి సినిమాలు చెయ్యడానికి ఇష్టపడరు, ఒకవేళ చేసినా కూడా మన ఆడియన్స్ చూడరు ‘ అని చెప్పాడట. లేదు డాడీ నన్ను నమ్మండి, కచ్చితంగా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తాది ఇక్కడ కూడా, దయచేసి రీమేక్ రైట్స్ కొనుక్కోండి అన్నాడట.

మహేష్ బాబు ప్రయోగాలకు పెట్టింది పేరు లాంటి వాడు, అతనిని అడగండి అని రానా అడగగా, సురేష్ బాబు మహేష్ బాబు ని సంప్రదించాడట. అప్పుడు మహేష్ బాబు ‘కథ చాలా బాగుంది, కానీ మన తెలుగు హీరోలు చేస్తే ఆడదు’ అని చెప్పడం తో సురేష్ బాబు ఇక ఆ సినిమా రీమేక్ రైట్స్ కొనే ఆలోచనని పక్కన పెట్టేసాడట. అదే సమయం లో అల్లు అరవింద్ ఈ సినిమాకి సంబంధించి తెలుగు డబ్బింగ్ రైట్స్ ని, అలాగే హిందీ రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసాడు. హిందీ లో ఆయన అమీర్ ఖాన్ ని హీరో గా పెట్టి ఇదే స్టోరీ తో, ఇదే టైటిల్ తో సినిమా చేసాడు.

అక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి , ఆరోజుల్లోనే వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రమే బాలీవుడ్ కి మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల చిత్రం. ఒకవేళ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని సురేష్ బాబు కొనుగోలు చేసి ఉంటే ఆ లాభాలను మొత్తం ఎంజాయ్ చేసేవాడు. రానా చెప్పిన మాట వినకుండా మహేష్ చెప్పిన మాట వినడం వల్ల వంద కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అని రానా ఇప్పటికీ చెప్పుకుంటాడట(Rana Lost Money). మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినీమా వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేదాం అనుకుంటున్నారు నిర్మాతలు.

Exit mobile version