Home Cinema Allu Arjun : పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

Allu Arjun : పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

దర్శకుడు సుకుమార్ ప్లాన్స్ పీక్స్ లెవెల్లో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన ఆలోచనలు గ్లోబల్ లెవెల్లో ఉంటాయి. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ భారీ ప్రతిష్టాత్మకంగా పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పుష్ప ది రైస్ కి సీక్వెల్‌గా రానుంది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న కనిపించనుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇంటర్నెట్‌లో చెక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో పుష్పరాజ్ సోదరి పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నటిస్తుందని సమాచారం. ఇక్కడ మనం ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం. పుష్ప సోదరి పాత్రలో అనిమల్ సినిమా ఫేమ్ తృప్తి దిమ్రి నటిస్తుంది అంటూ ఇండస్ట్రీలో టాక్. తృప్తి దిమ్రి బాలీవుడ్‌లో అనేక చిత్రాలలో నటించింది మరియు యానిమల్ చిత్రానికి మంచి గుర్తింపు పొందింది. రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది. యానిమల్ సినిమాలో తృప్తి నటనను బన్నీ ప్రశంసించారు.

tripti-dimri-acting-as-allu-arjun-sister-in-pushpa-2

అయితే అల్లు అర్జున్ నటించే పాన్ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ తృప్తి సోదరిగా నటిస్తుందనే వార్త వైరల్ అవుతుంది. ఇది తెలుసుకున్న ప్రజలు వివిధ స్థాయిలలో ప్రశంసించారు. మరి దీనిపై పుష్ప 2 టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. పుష్ప 2 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాతో తెలుగు సినిమా చరిత్రను తిరగరాస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version