Home Cinema వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి కార్డులో ఈ తప్పుని గమనించారా..

వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి కార్డులో ఈ తప్పుని గమనించారా..

వరుణ్ తేజ్ లావణ్య ఎంతో కాలం నుండి ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి ప్రేమ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. చిరంజీవి ఒప్పుకోకపోవటం వల్ల వీరి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. కానీ వీరు మాత్రం నిరాశచెందకుండా ఎలానో అలా చిరంజీవిని ఒప్పించి నిశ్చితార్ధం చేసేసుకున్నారు(varun lavanya wedding card). ఇప్పుడు వీరి పెళ్లి కూడా దెగ్గర పడింది. వీరి పెళ్లి ఫిక్స్ అయ్యిందో లేదో చెల్లి నిహారిక విడాకులు తీసుకుంది.

lavanya-tripathi

నిహారిక విడాకుల వాళ్ళ వరుణ్ లావణ్యాల పెళ్లి కోడిగా వాయిదా పడింది అనే చెప్పాలి. ఒక స్టేజి లో ఐతే నిహారిక విడాకుల తరువాత వీరి పెళ్లి క్యాన్సిల్ అవుతుంది అనే వార్తలు కూడా సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. వరుణ్ లావణ్య లు ఇటలీ లో నవంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి మెగా ఫామిలీ తో పాటు మరికొందరు స్టార్ సెలబ్రిటీస్ కూడా హాజరు కానున్నారు.

ఇకపోతే ప్రస్తుతం వరుణ్ లావణ్య ల పెళ్లి కార్డు నెట్టింట వైరల్ గా మారింది. వరుణ్ లావణ్య తమ పెళ్లి కార్డును చాల సింపుల్ గా ఎంతో అందంగా డిజైన్ చేయించారు. సాధారణంగా పెళ్లి కార్డులో పెళ్లి ఎక్కడ జరగబోప్తుంది అని వివరాలు ఉంటాయి కానీ వీరి పెళ్లి కార్డులో పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి ఎటువంటి వివరాలు పెట్టలేదు(varun lavanya wedding card). కేవలం తమ రిసెప్షన్ హైదరాబాద్ మాదాపూర్ లో జరుగుతున్నట్టు ఉంది.

పెళ్లి కార్డు తో పాటు తమ రిసెప్షన్ కి కార్ పార్కింగ్ పాస్ పెట్టి ఇస్తున్నారు అట వరుణ్ లావణ్య జంట. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది. పెళ్ళికి పిలవ కుండా ఇలా డైరెక్ట్ రిసెప్షన్ కి పిలవటం ఏంటి అంటూ కొందరు మరి కొందరు ఐతే డెస్టినేషన్ వెడ్డింగ్ కదా కేవలం బాగా క్లోజ్ వారిని మాత్రమే పెళ్ళికి పిలుస్తున్నారు అంటూ కామెంట్ చేసారు. ఏదిఏమైనా వారి పెళ్లి వారి ఇష్టం.

వరుణ్ తేజ్ లావణ్య లు కలిసి 2-3 చిత్రాల్లో నటించారు. వీరి ఇద్దరు కలిసి అంతరిక్షం 9000kmph అనే సినిమా చేస్తుండగా వీరి అభిప్రాయాలు కలిసాయి అని, ఆ సినిమా సమయంలోనే ప్రేమించుకున్నాము అని ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.

Exit mobile version