Home Cinema Rajamouli-Venkatesh: మాట ఇచ్చి తప్పిన రాజమౌళి.. కోపంతో రగిలిపోతున్న వెంకటేష్..

Rajamouli-Venkatesh: మాట ఇచ్చి తప్పిన రాజమౌళి.. కోపంతో రగిలిపోతున్న వెంకటేష్..

Venkatesh Angry On Rajamouli: టాలీవుడ్ లో నిన్నటి తరం హీరోలలో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న హీరో ఎవరు అని అడిగితే ప్రతీ ఒక్కరు చెప్పే పేరు విక్టరీ వెంకటేష్. కెరీర్ లో ఆయన అత్యధిక శాతం రీమేక్ సినిమాలే చేసారు. కానీ రీమేక్స్ కంటే ఒరిజినల్ బాగుంది అనే రేంజ్ లో నటించేవాడు ఆయన. ఇది కత్తి మీద సాము లాంటిది. ఎక్కువగా ఆయన సినిమాలు యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఉండేవి. ఇప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయన క్రేజ్ ని మ్యాచ్ చేసే హీరో రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన వెంకటేష్ కి ఒక డ్రీం రోల్ మిగిలి పోయింది.

rajamouli-venkatesh

స్వామి వివేకానంద బయోపిక్ లో నటించడం ఆయన కోరిక అంటూ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పాడు కూడా. రిటైర్మెంట్ ఇచ్చే లోపు ఈ పాత్ర చేస్తాను అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు. కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ కి రాజమౌళి దర్శకత్వం వహించాల్సిందిగా వెంకటేష్ స్వయంగా కోరాదట. వీళ్లిద్దరి మధ్య ఈ సంభాషణ జరిగి పదేళ్లు దాటింది. ముందుగా రాజమౌళి కచ్చితంగా ఈ సినిమాలు చేద్దాం అని మాట ఇచ్చాడు. ప్రస్తుతం ఒప్పుకున్నా సినిమాలు పూర్తి అవ్వగానే మీ ప్రాజెక్ట్ చేస్తాను సార్ అని మాట ఇచ్చాడట(Venkatesh Angry On Rajamouli).

రాజమౌళి మహేష్ కి ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది. ఇక వెంకటేష్ కి ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఇంకెంత సమయం పడుతుందో అని అందరూ అనుకుంటున్నారు. వెంకటేష్ మార్కెట్ తో పోలిస్తే రాజమౌళి మార్కెట్ ఇప్పుడు వెయ్యి రెట్లు పెరిగింది. అంతే కాకుండా రాజమౌళి సినిమాలకు హీరోలు యుక్త వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే ఆయన టార్చర్ తట్టుకోగలరు అని అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు వెంకటేష్ వయస్సు 60 ఏళ్ళు దాటింది. ఈ వయస్సులో వెంకటేష్ తో రాజమౌళి సినిమాలు చేస్తారా..?

వివేకానంద బయోపిక్ కాబట్టి పెద్దగా ఫైట్స్, సాంగ్స్ వంటి వాటికి చోటు లేదు. కాబట్టి చేసే అవకాశం ఉంది. కాను రాజమౌళి మహేష్ తో చెయ్యబోయ్యే సినిమాని రెండు పార్ట్స్ లో తెరకేక్కించబోతున్నాడు. తక్కువలో తక్కువ కనీసం మూడు నుండి నాలుగేళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత ఆయన మహా భారతం ని తెరకేక్కిస్తాను అని రూమర్ ఉంది. మరి ఒకవేళ మహాభారతం తెరకేక్కిస్తే మాత్రం ఇక వెంకటేష్ తో ప్రాజెక్ట్ చేస్తాను అని ఇచ్చిన మాట రాజమౌళి తప్పినట్టే. మరి వెంకటేష్ తన డ్రీం ప్రాజెక్ట్ ని ఏ డైరెక్టర్ తో చేస్తాడో చూడాలి.

Exit mobile version