Home Cinema Apsara Rani : ఆ హీరో పక్కలో పడుకొని ఉండుంటే నేను టాప్ హీరోయిన్ గా...

Apsara Rani : ఆ హీరో పక్కలో పడుకొని ఉండుంటే నేను టాప్ హీరోయిన్ గా ఉండేదానిని.. సంచలన కామెంట్స్ చేసిన అప్సర రాణి!

Apsara Rani : ఈమధ్య కాలంలో ఓటీటీ అభివృద్ధి చెందిన తర్వాత దానికి ఎలాంటి సెన్సార్ లేదు కాబట్టి మేకర్స్ పరిధులు దాటిమరీ బోల్డ్ కంటెంట్ ని చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా ఈమధ్య బోల్డ్ సన్నివేశాల్లో నటించడం చూసి వారిని అభిమానించే వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం కేవలం బోల్డ్ కంటెంట్ కి మాత్రమే పరిమితం అవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు అప్సరా రాణి. ఈమె ఎక్కువ రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ గా ప్రసిద్ధి గాంచింది.

actress-apsara-rani

అతను తీసే బూతు సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్ గా నటించేది ఈమెనే. గత ఏడాది రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లెస్బియన్ లవ్ స్టోరీ ‘డేంజరస్’ లో ఒక హీరోయిన్ గా నటించింది. ఇందులో ఆమె నైనా గంగూలీ తో కలిసి చేసిన రొమాన్స్ నేషనల్ వైడ్ గా సెన్సేషన్ ని సృష్టించింది. ఈ సినిమా ఆడిందా లేదా అనే విషయం పక్కన పెడితే అప్సర రాణి కి మాత్రం ఒక రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. అయితే ఆ పాపులారిటీ ఆమెకి ఏమాత్రం కూడా అవకాశాలను తెచ్చిపెట్టలేకపోయాయి.

కేవలం రవితేజ హీరో గా నటించిన ‘ధమాకా’ చిత్రం లో ఒక ఐటెం సాంగ్ చేసే అవకాశం మాత్రమే దక్కింది. ఆ పాట పెద్ద హిట్ అయ్యింది కూడా. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ నాకు కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురు అయ్యాయి. ఒక పెద్ద హీరో తన సినిమాలో అవకాశం ఇస్తాను , కానీ కమిట్మెంట్ ఇవ్వాలని మ్యానేజర్ తో అడిగించాడు. అది నాకు అసలు నచ్చలేదు. ఇంత పెద్ద హీరోలు కూడా ఇలాంటి పనులు చేస్తారా అని ఆశ్చర్యం వేసింది.

ఆరోజు నేను అతనికి కమిట్మెంట్ ఇచ్చి ఉంటే, ఈరోజు ఇండస్ట్రీ లో నేను వేరే స్థాయిలో ఉండేదానిని. ‘ అంటూ చెప్పుకొచ్చింది అప్సర రాణి. అయితే ఈమె రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ అవ్వడం వల్లే ఇండస్ట్రీ లో అవకాశాలు రావడం లేదని కొంతమంది విశ్లేషకులు చెప్పే మాట.

అతను తీసే బూతు సినిమాల్లో నటించడం వల్ల ఈ అమ్మాయి అందంగా ఉన్నపటికీ ఎవ్వరూ అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని అంటున్నారు విశ్లేషకులు. మరి భవిష్యత్తులో(Apsara Rani) అయినా ఈమె మంచి స్థాయిలోకి వస్తుందో లేదో చూడాలి.

Exit mobile version