Home Cinema Akkineni Family : అక్కినేని హీరోల జాతకం చెప్పిన వేణు స్వామి.. ప్లాప్స్ కారణం ఇదే..

Akkineni Family : అక్కినేని హీరోల జాతకం చెప్పిన వేణు స్వామి.. ప్లాప్స్ కారణం ఇదే..

Akkineni Family : అక్కినేని కుటుంబానికి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదని చెప్పుకోవచ్చు. వీరు చేసిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వడం లేదు మరియు వీరి అభిమానులకు ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. నాగార్జున, నాగచైతన్య మరియు అఖిల్ ఈ ముగ్గురు అక్కినేని (Venu Swamy Akkineni Family) కుటుంబం యొక్క లెగసీని ముందుకు తీసుకపోతున్నారు. కానీ వీరికి అపజయాలు ఎదురవుతున్నాయి. నాగార్జున లేటెస్ట్ సినిమా ది ఘోస్ట్ అట్టర్ ప్లాప్ గా నిలిచింది.

venu-swamy-horroscope-of-akkineni-family-heros-and-said-this-is-the-reason-behind-continous-flops

ఈ సినిమాపై ఆయన ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆయన చేసిన అన్ని సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. నాగార్జున మొదటి కుమారుడు నాగచైతన్య విషయానికి వస్తే, ఈయన ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు ఇవే.. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఒక మోతాజు హిట్ కొట్టాడు. కానీ ఆ తరువాత వచ్చిన లాల్ సింగ్ చెడ్డ, థాంక్యూ మరియు కస్టడీ విడుదలై ప్లాప్ గా నిలిచాయి. నాగచైతన్య తన తరువాతి సినిమా కోసం దర్శకుడు చందూ మొండేటితో పని చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుగుతుంది. ఇక్క నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని చేసిన ఒక్క సినిమా కూడా అంత మంచి హిట్ కొట్టలేదు. ఇతనికి అభిమానులు ఎక్కువవే. అభిమానులకు అఖిల్ నిరాశే మిగిలించ్చారు. ఒక ఫ్యాన్ ఇతనికి ముద్దుగా అయ్యగారు అని పేరు పెట్టాడు మరియు అయ్యగారే నెంబర్ వన్ అనే స్లోగన్ తో వైరల్ అయ్యాడు. అఖిల్ రీసెంట్ సినిమా ఏజెంట్.. ఈ సినిమా అఖిల్ అసలు ఎందుకు ఒప్పుకున్నాడో అని అభిమానులు గుండెలు బాదుకున్నారు.

ఈ సినిమా దర్శకుడు సూర్రెన్దర్ రెడ్డి. ఇతను టాలీవుడ్ లో మంచి హిట్ సినిమాలు తీసాడు కానీ అక్కినేని అఖిల్ ను చూడగానే ఏమనుకున్నాడో తన కెరీర్ లోనే అతిపెద్ద డిసాస్టర్ సినిమా తీసాడు. ఈ అయ్యాగారు అఖిల్ హిట్ ఎప్పుడు కొడతాడా ఆ దేవుడికే తెలవాలి. (Venu Swamy Akkineni Family)

అయితే ఇటీవల వేణుస్వామి అక్కినేని కుటుంబం గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అదేంటంటే అక్కినేని ఫ్యామిలీలో వారి జాతకాలలో కొన్ని దోషాలు ఉన్నాయి మరియు అందువలనే వీరికి సక్సెస్ రావడం లేదని ఆయన అన్నారు.

Exit mobile version