Home Cinema Uday Kiran: చనిపోయే వారం రోజుల ముందు ఉదయకిరణ్ కి ఇంత నీచమైన కల వచ్చిందా.....

Uday Kiran: చనిపోయే వారం రోజుల ముందు ఉదయకిరణ్ కి ఇంత నీచమైన కల వచ్చిందా.. అందుకే..

Uday Kiran: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, కేవలం టాలెంట్ తో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి కెరీర్ లో ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లిన హీరోలలో ఒకడు ఉదయ్ కిరణ్. ప్రముఖ దర్శకుడు తేజ నిర్వహించిన ఆడిషన్స్ ద్వారా చిత్రం సినిమాలో హీరో గా సెలెక్ట్ అయిన ఉదయ్ కిరణ్, ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన రేంజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వరుసగా నువు నేను, మనసంతా నువ్వే వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

uday-kiran-death

ఈ మూడు సినిమాలతో ఉదయ్ కిరణ్ అప్పటి స్టార్ హీరోల రేంజ్ కి తన మార్కెట్ ని వ్యాప్తి చేసుకున్నాడు. అలా కెరీర్ లో దూసుకుపోతున్న సమయం లో ఉదయ్ కిరణ్ కి వరుసగా డిజాస్టర్ సినిమాలు రావడం మొదలయ్యాయి. దాంతో ఎంత తొందరగా అయితే ఎదిగాడో అంతే తొందరగా ఆయన క్రిందకి దిగజారిపోయాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూతురితో నిశ్చితార్థం చేసుకొని, పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత ఉదయ్ కిరణ్(Uday Kiran) జీవితం తలక్రిందులు అయిపోయింది. అప్పటి వరకు ఆయన ఒప్పుకున్నా సినిమాలన్నీ ఆయన చెయ్యి జారిపోయాయి, అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

అలాంటి సమయం లో చేతికి వచ్చిన సినిమా చేసి, డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని కెరీర్ ని సర్వనాశనం చేసుకున్నాడు. దాంతో ఆయనకీ ఆర్ధిక పరిస్థితులు కూడా బాగా దెబ్బతినింది. సరైన అవకాశం కోసం ఎదురు చూసి చూసి అలసిపోయి, తీవ్రమైన మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నడుస్తున్న ఈ ఓటీటీ ట్రెండ్ ఉదయ్ కిరణ్ బ్రతికి ఉండుంటే ఎన్నో వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు చేసేవాడు, కాలం ఆయనకి తగ్గట్టుగా మారేది, ఆత్మహత్య చేసుకొని చాలా పెద్ద పొరపాటు చేసాడు అని అందరూ అనుకున్నారు.

ఇకపోతే రీసెంట్ గా ఉదయ్ కిరణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అదేమిటంటే ఆయన చనిపోయే వారం రోజుల ముందు తన కలలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా కల వచ్చిందట. ఆత్మహత్య చేసుకున్న తర్వాత తన గురించి మీడియా ఎలా మాట్లాడింది అనేది కూడా కళ్ళకు కట్టినట్టు కనిపించిందట. ఈ విషయాన్నీ ఉదయకిరణ్ ఇంట్లో కూడా చెప్పాడట. ఎప్పుడూ ఆ ఆలోచనలతో ఉన్నావు కాబట్టే ఇలాంటి కలలు వస్తున్నాయి నీకు అని ఉదయకిరణ్ ని ఇంట్లో వాళ్ళు తిట్టారట. సరిగ్గా ఈ కల వచ్చిన వారం రోజులకు ఆయన నిజంగానే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది.

Exit mobile version