Home Cinema Ntr-Charan: ఆ అవార్డు గెలిచేది ఎవరు.. ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫాన్స్ మధ్య పెద్ద రచ్చ..

Ntr-Charan: ఆ అవార్డు గెలిచేది ఎవరు.. ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫాన్స్ మధ్య పెద్ద రచ్చ..

Ntr-Charan: స్టార్ హీరోలతో మల్టీస్టార్ర్ర్ సినిమాలు తియ్యడానికి దర్శక నిర్మాతలు తెగ బయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అభిమానుల అంచనాలను అందుకోగలమా? ఒక్క హీరో పాత్ర కాస్త తగ్గినా అభిమానుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అందుకే స్టార్ హీరోలను పెట్టి సినిమాలు తియ్యడానికి జంకుతారు దర్శక నిర్మాతలు. కానీ డైరెక్టర్ రాజమౌళి, దశాబ్దాల నుండి బాక్స్ ఆఫీస్ పోరులో నువ్వా నేనా అని తలపడే రేంజ్ ఉన్నటువంటి నందమూరి, మెగా ఫ్యామిలీ నుండి నేటి తరం మాస్ హీరోలుగా పిలవబడే రామ్ చరణ్, ఎన్టీఆర్(NTR Ram Charan) ని పెట్టి RRR చిత్రాన్ని చేసాడు రాజమౌళి.

ram-charan-ntr

ఈ సినిమా విడుదల తర్వాత క్రియేట్ అయిన రికార్డ్స్ మరియు దక్కినటువంటి అనితరసాధ్యమైన అవార్డ్స్, రివార్డ్స్ ని మూవీ టీం తో పాటుగా అభిమానులు కూడా ఆస్వాదించారు. కానీ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వీళ్లిద్దరి మధ్య గొడవలు ఈ చిత్రం ప్రారంభమైన మొదటి రోజు నుండే ఉంది. మెగా మరియు నందమూరి అభిమానుల మధ్య గొడవలు ఉండడం అనేది కొత్తేమి కాదు, దశాబ్దాల నుండి ఉంది. కానీ ఈ సినిమా తో అయిన తగ్గుతుందేమో అని అనుకున్నారు, కానీ తగ్గలేదు, ఇంకా పెరిగాయి కూడా. ఇలా అవుతుందని రాజమౌళి కూడా ఊహించి ఉండదు.

ఇకపోతే ఈ సినిమాకి ఇప్పటి వరకు ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ దక్కిన సంగతి అందరికీ తెలిసిందే. కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు లోకల్ అవార్డ్స్ వంతు ప్రారంభం అయ్యింది. సౌత్ ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పిలవబడే అవార్డ్స్ లో ఒకటి సైమా అవార్డ్స్. ఈ అవార్డ్స్ వేడుక అతి త్వరలోనే జరగబోతుంది(NTR Ram Charan). ఈ అవార్డ్స్ లో ఉత్తమ నటుడి క్యాటగిరీ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా నామినేట్ అయ్యారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఈ అవార్డు గెలుచుకుంటారు అనే దానిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.

రామ్ చరణ్ గెలుస్తాడని ఆయన అభిమానులు బలమైన నమ్మకంతో ఉండగా, సైమా అవార్డుతో పాటుగా సౌత్ ఇండియా లో ఉన్న అన్నీ ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఎన్టీఆర్ కి దక్కుతాయని నమ్మకంతో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి వీరిద్దరిలో ఈ అవార్డు ఎవరికీ దక్కుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఓటింగు సిస్టం ద్వారా అయితే ఎన్టీఆర్ లేదా జ్యూరీ సెలక్షన్ ద్వారా అయితే రామ్ చరణ్ కి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు, చూడాలి మరి.

Exit mobile version