విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా ఫామిలీ స్టార్. ఈ సినిమా నిన్న థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వబోతుంది అని రౌడీ ఫాన్స్ అందరూ అనుకున్నారు కానీ కట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో నుండే చాలా నెగటివ్ టాక్ అందుకుంది.
అర్జున్ రెడ్డి లాంటి సినిమాలో నటించిన విజయ్ ని ఇలాంటి క్యారెక్టర్ లో చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫామిలీ స్టార్’ సినిమా ప్లాప్ అవ్వటంతో ఇద్దరు సెలెబ్రిటీలు తెగ సంతోష పడిపోతున్నారు అట. ఇప్పుడు ఇదే నెట్టింటా హాట్ టాపిక్, ఇంతకీ ఎవరు వారు అనుకుంటున్నారా .? వారు మరెవరో కాదు అల్లు అరవింద్ మరియు నాగ చైతన్య. విజయ్ సినిమా ప్లాప్ ఐతే విల్లు సంతోష పడటం ఏంటి అనుకుంటున్నారా.?
డైరెక్టర్ పరశురామ్ మొదట సినిమా కథ అరవింద్ కె చెప్పాడు అట. అరవింద్ నాగ చైతన్యను పెట్టి ఈ సినిమా చేదాం అనుకున్నాడు అట. కానీ పరశురామ్ మాత్రం మెల్లిగా సైడ్ ఐపోయి దిల్ రాజు కి కథ చెప్పి ఓకే చేయించేసుకున్నాడు అట. ఈ విషయం తెలిసి అల్లు అరవింద్ కి పట్టరానంత కోపం వచ్చింది అట. కానీ ఇప్పుడు సినిమా ప్లాప్ అవ్వటం తో పర్లేదు లే డబ్బులు మిగిలాయి అని తెగ కుష్ ఐపోతున్నారు అట.