Kanika Subramaniam : కొంతమంది హీరోయిన్లను చూసి మనం ఎంతో ఇష్టపడుతాము, హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాము, వాళ్ళను చూస్తూనే మనం కూడా పెరుగుతాము, ఇలాంటి అమ్మాయి మన జీవిత భాగస్వామి అయితే చాలా బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాము, కానీ అలాంటి హీరోయిన్లు అకస్మాత్తుగా మాయం అయిపోతుంటారు. అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని చూడగానే గుర్తుపట్టలేము. కొందరు లావుగా అయిపోతారు, మరికొందరు ముఖం ఉబ్బిపోయిన వారిలా తయారు అవుతారు, మరికొందరైతే యవ్వనం లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు అందంగా కనిపిస్తారు.
ఇలా ఎన్నో రకాల అనుభవాలు మనకి ఎదురై ఉంటాయి. అలాంటి హీరోయిన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. మనం చిన్నతనం లో ఉన్నప్పుడు వచ్చిన ‘ఒట్టేసి చెప్తున్నా’ అనే సినిమా మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. శ్రీకాంత్ హీరో గా నటించిన ఈ సినిమా కామెరిసిల్ గా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ శివాజీ నెగటివ్ రోల్ లో అదరగొడుతాడు, కమెడియన్ సునీల్ పాత్ర కూడా బాగా పండిన చిత్రమిది. ఈ సినిమాలో హీరోయిన్ గా కనికా సుబ్రహ్మణ్యం(kanika subramaniam) నటించింది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయికి సినిమాలు అంటే మహా పిచ్చి.
ఆ పిచ్చితోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఈమెకి తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ అవి ఆమెకి అంతగా గుర్తింపుని తీసుకొని రాలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరం గా ఉన్న ఆమె మళ్ళీ తమిళంలో ఫైవ్ స్టార్ అనే చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది. కేవలం నటిగా మాత్రమే కాకుండా కనికా సింగర్ గా కూడా గొప్పగా రాణించింది. తమిళం లో ఈమె అనేక పాటలు కూడా పాడింది. సినిమాల్లో మాత్రమే కాకుండా, ఈమె అనేక తమిళ సీరియల్స్ లో కూడా నటించి తన సత్తా చాటింది.
అయితే సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే కనికా, రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఒక ఫోటో ని చూసి అభిమానులు భయపడ్డారు. సగం కాలిపోయిన ముఖం తో ఆమె కనపడడం చూసి కంగు తిన్నారు. అయితే అది కేవలం మేకప్ మాత్రమే అని తర్వాత తెలిసింది. తమిళం లో రీసెంట్ గా విడుదలైన విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ చిత్రంలో కనికా ఒక ముఖ్య పాత్ర పోషించింది, ఆ పాత్రకు సంబంధించిన మేకప్ ఇది.