SS Rajamouli : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం దర్శకధీరుడు ఎవరంటే సందేహం లేకుండా రాజమౌళి పేరే చెప్పుకుంటారు. ఈయన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. రాజమౌళికి టాలీవుడ్ లో అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈయన తీసిన అన్ని సినిమాలు బారి విజయాన్ని సాధించాయి (SS Rajamouli Habits) మరియు ఓటమిలేని దర్శకుడిగా నిలబడ్డారు.
రాజమౌళి ఇటీవల ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో తీసిన ఆర్ఆర్ఆర్ బారి విజయాన్ని సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రేక్యతలు మరింత పెరిగేలా చేసింది. ఈయనను కొందరు సినీ ప్రముఖులు జక్కన అని కూడా పిలుస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళికి దక్కిన ఈ ఘనత మారే స్టార్ డైరెక్టర్ కు దక్కలేదు. ఎంత పెద్ద డైరెక్టర్లు అయినా ఒక్క సినిమా అయినా ప్లాప్ అయినాయి కానీ జక్కన తీసిన అన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ కొట్టాయి.
అయితే ఈ మధ్య ఈ స్టార్ డైరెక్టర్ గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, రాజమౌళి కి ఒక అలవాటు ఉన్నదంట. రాజమౌళి ఓ సాధారణమైన కుటుంబం నుండి వచ్చాడు. ఈయన పూటక ముందు వీరికి ఆస్తులు ఉండేవంటా. రాజమౌళి పుట్టే సరికి ఆస్తులని పోయి పెద్ద బంగ్లా నుండి చిన్న ఇంట్లో కి వచ్చారని ఆయన చాల సందర్భాలలో చెప్పుకొచ్చారు. అందుకని ఆయన డబ్బు ఉన్నపుడే కాపాడుకోవాలి అనే దానిని ఎక్కువగా నమ్ముతాడట. (SS Rajamouli Habits)
అందుకు గాను అయన పారితోషికంగా ఎన్ని కోట్ల తీసుకున్న కనీసం లక్ష రూపాయిలు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారట. ఆయనను కొందరు సన్నిహితులు సరదాగా డబ్బు పిచోడని కూడా అంటారంట. ఈయన ట్రాక్ రికార్డుకు ఇతనికి ఇచ్చే పారితోషికం 20 నుండి 30 కోట్ల వరకు ఉంటదట. ఒకరోజు ఖర్చు ఎంత అయిందో రాతిరి కూర్చొని రాసుకొని ఏమైనా అవసరం లేని ఖర్చు చేస్తున్నారో అని జాగ్రత్తపడుతారట.
ఏది ఏమైనా రాజమౌళి డబ్బు విషయంలో జాగ్రత పడటంలో తప్పులేదని ఈ వార్తాకు స్పందిస్తున్నారు ఆయన అభిమానులు. ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దీనికోసం మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.