Thursday, September 19, 2024
HomeCinemaRam Charan : మీషో యాడ్ కోసం రామ్ చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..

Ram Charan : మీషో యాడ్ కోసం రామ్ చరణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..

Ram Charan Meesho : నిన్న మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, #RRR చిత్రం తో తన నట విశ్వరూపం ని చూపించి బౌండరీలు బ్లాస్ట్ చేసి, పాన్ వరల్డ్ స్టార్ అనే ఇమేజి ని సొంతం చేసుకున్న సంగతి అందిరికీ తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ కి అన్నీ వర్గాలలో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు, ఆయన ఏది చేసినా సంచలనం అనే విధంగా అయిపోయింది. ముఖ్యంగా ఆస్కార్ అవార్డ్స్ ప్రొమోషన్స్ లో అంతర్జాతీయ లెవెల్ లో రామ్ చరణ్ అక్కడి మీడియా కి దగ్గరై హాట్ టాపిక్ గా మారిపోయాడు.

ram-charan-meesho

సినిమా విడుదలైనప్పటి క్రేజ్ కంటే కూడా , ఆస్కార్ అవార్డ్స్ కి #RRR మూవీ ఎంపిక అయ్యినప్పుడు రామ్ చరణ్ కి ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఈ రేంజ్ లో ఎదిగిన రామ్ చరణ్ క్రేజ్ ని ఉపయోగించుకోకుండా ఎవరు మాత్రం ఉంటారు? అందుకే ఆయన క్రేజ్ మరియు ఫేమ్ ని ఉపయోగించుకోవడానికి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు ఇప్పుడు రామ్ చరణ్ వెంటపడ్డాయి. ఇప్పటికే పలు బ్రాండ్స్ కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్, ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ ఈ కామర్స్ యాప్ మీ షో కి ప్రచారకర్త గా వ్యహరిస్తున్నాడు(Ram Charan Meesho).

ram-charan-meesho-advertisement

మీషో యాప్ లో ఆడవాళ్లకు మరియు మగవాళ్లకు సరిపడా బట్టలు ,నగలు మరియు ఇతర అవసరాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ తర్వాత ఇండియా లో అంతటి ప్రసిద్ధి గాంచిన ఈ కామర్స్ యాప్ గా ఈ మీషో ప్రసిద్ధి గాంచింది. అందుకే రామ్ చరణ్ ఈ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. రీసెంట్ గా ఈ యాప్ కి సంబంధించిన యాడ్ వీడియోకి విడుదల అవ్వగా, దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ యాడ్ చేసినందుకు గాను రామ్ చరణ్ కి ఏకంగా 8 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చారట.

ram-charan

ఈ రేంజ్ రెమ్యూనరేషన్ టాలీవుడ్ లో కేవలం ఒకరిద్దరు హీరోలు మాత్రమే అందుకుంటున్నారు, వారిలో రామ్ చరణ్ కూడా ఒకడు. ఇక రాబొయ్యే రోజుల్లో ఈ పాన్ వరల్డ్ స్టార్ ఇనీకెన్ని బ్రాండ్స్ ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి. మన తెలుగు రాష్ట్రాల నుండి రామ్ చరణ్ ఉండగా నార్త్ సైడ్ రణ్వీర్ సింగ్, దీపికాపడుకొనే తమిళ్ నుండి త్రిష బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts