Samantha Decision : ‘ఏం మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తొలిసినిమాతోనే కోట్లాది మంది కుర్రాళ్ళ మనసుల్ని కొల్లగొట్టిన హీరోయిన్ సమంత. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకి టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్ హీరోలందరూ సమంత ని తమ సినిమాలలో హీరోయిన్ గా తీసుకునేందుకు ఎగబడ్డారు. అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే సౌత్ లో నెంబర్ 1 హీరోయిన్ గా మారి , స్టార్ హీరోలతో సమానంగా ఇమేజి ని సొంతం చేసుకుంది. అయితే సమంత ఎప్పుడైతే నాగ చైతన్య తో విడాకులు తీసుకుందో ఆమె బ్యాడ్ డేస్ ప్రారంభం అయ్యాయి.
చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. దానికి తోడు ఆమె మయోసిటిస్ లాంటి ప్రాణాంతక వ్యాధి సోకడం వల్ల చాలా కాలం వరకు సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్స్ తో బాగా బిజీ అయ్యింది. ప్రస్తుతం ఈమె అమెజాన్ ప్రైమ్ సంస్థ కోసం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ మరియు విజయ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు షూటింగ్స్ లో క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్న సమంత రీసెంట్ గా తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియా లో ఉన్న ఆమె అభిమానులను తీవ్రమైన దుఃఖం లోకి నెట్టేసింది.
అదేమిటంటే ఆమె భవిష్యత్తులో చెయ్యబోయే సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ లు మొత్తం వెనక్కి ఇచ్చేస్తోందట(Samantha Decision). దీంతో సమంత ఇక సినిమాలకు దూరం అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మయోసిటిస్ నుండి కోలుకొని పెద్ద పెద్ద క్రేజీ ప్రాజెక్ట్స్ ని అందుకొని ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్తున్న సమంత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఏమాత్రం బాగాలేదని అంటున్నారు ఆమె అభిమానులు. అయితే సమంత ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక్క పెద్ద కారణం ఉందని అంటున్నారు ఆమె సన్నిహితులు. త్వరలోనే ఆమెకి ఒక మేజర్ ఆపరేషన్ చేయబోతున్నారట.
అందుకు సంబంధించి కొంతకాలం విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆమె సినిమాలకు తాత్కాలికంగానే బ్రేక్ ఇచ్చింది అని , శాశ్వతంగా కాదని, కాబట్టి అభిమానులు కంగారు పడొద్దు అంటూ సమంత సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. మరి వీటిల్లో ఏది నిజం ఏది అబద్దం అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. చూదాం ఈ సారైనా విజయ్ దేవరకొండ సినిమా ఖుషి తో హిట్టు కొడుతుందో లేదో, ఒక వేళా ఈ సినిమా కూడా ప్లాప్ ఐతే సమంత సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరో ఎలానో సినిమా అవకాశాలు ఇవ్వరు కదా.