Friday, November 22, 2024
HomeNewsBRS Party : లేడీ సర్పంచ్ vs BRS ఎమ్మెల్యే.. బయటపడ్డ కాల్ రికార్డింగ్..

BRS Party : లేడీ సర్పంచ్ vs BRS ఎమ్మెల్యే.. బయటపడ్డ కాల్ రికార్డింగ్..

BRS Party : మన భారతదేశంలో రాజకీయాలు రోజు రోజుకి దిగజారుతున్నాయి. ఇటీవల తెలంగాణాలో జరిగిన ఒక సంగటన రాజకీయనాయకులు ప్రజలు తమకిచ్చిన పవర్ను ఎలా దురివినియోగం చేసుకుంటున్నారో చూడవొచ్చు. స్టేషన్ ఘనపూర్ brs ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. జానకీపురం మహిళా సర్పంచ్ ను రాజయ్య వేదిస్తునారని నవ్య చెప్పుకొచ్చారు. తనను లైంగికంగా ఎమ్మెల్యే వేధిస్తున్నారని మహిళా సర్పంచ్ నవ్య ఆరోపించారు.

ఎమ్మెల్యే గత మార్చ్ నుండి తనను లైగికంగా వేధిస్తున్నాడు, ఫోన్ కాల్స్ చేసిమరి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు అని నవ్య ఆరోపించింది. ఇదంతా రాజయ్య ఆదేశపూర్వకంగానే చేస్తున్నాడని అన్నారు. ఎమ్మెల్యే తాను చెప్పినట్లు నడుచుకోకపోతే పార్టీలో స్తానం ఇవ్వనని బెదిరిస్తున్నాడట. పార్టీ మీటింగ్లోను నవ్య పక్కన నిల్చొని బుజ్జలపై చేతులు వేసి తనను ఇబ్బంది పడేలా చేస్తాడని తాను చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే రాజయ్య, నవ్య నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా నిలిపివేస్తామని బేదిరించారట.

రాజయ్య అనుచరులు నవ్యకు కాల్ చేసి వేదిస్తున్నారట. ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ ఇపుడు వైరల్ అవ్వుతుంది. ఇదంతా ఏంటని మీడియా brs ఎమ్మెల్యే రాజయ్యను అడిగితె, అవ్వని కట్టుకథలని ఆయన కొట్టి పారేసారు. ఇంతకూ ముందు నవ్య రాజయ్యపై ఇలాంటి ఆరోపణులు చేసింది. కానీ కొద్దీ రోజులతరువాత ప్రెస్ మీట్ పెట్టి మేమంతా ఒక్కటే అని మీడియా ముందు చెప్పింది. మల్లి కొద్దీ నెలల తరువాత ఇప్పుడు రాజయ్య తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తుంది.

నవ్య రికార్డు చేసిన రాజయ్య కాల్ రికార్డింగ్స్ తనకు ఇచ్చేయాలని బెదిరిస్తున్నారని ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. నవ్య ఆరోపణులు ఇంతటితో ఆగలేదు.. ఎమ్మెల్యే రాజయ్య, తన భర్తను తనను విడగొట్టడానికి పన్నాగం పండుతున్నాడని ఆమె అన్నారు.

ఈ విషయంపై పోలీసు స్టేషన్లో ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చిన పటించుకోవడం లేదని అన్నారు. తనపై జరుగుతున్న ఈ అసభ్యకరమైన చర్యలపై పోలీసులు చట్టబధంగా వ్యవహరించాలని జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య డిమాండ్ చేస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Posts