Sunday, October 6, 2024
HomeCinemaAllu Arjun: అర్థ రాత్రి సమయాల్లో ఫామ్ హౌస్ లో అల్లు అర్జున్ చేసే పనులు...

Allu Arjun: అర్థ రాత్రి సమయాల్లో ఫామ్ హౌస్ లో అల్లు అర్జున్ చేసే పనులు ఇవా..

Allu Arjun Farmhouse: టాలీవుడ్ లో ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా ఈయన ఏమి చేసినా సెన్సేషన్ అయిపోతుంది. ఒకప్పుడు అల్లు అర్జున్ అంటే ప్రతీ హీరో అభిమానికి ఇష్టం ఉండేది,కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురం లో’, ‘పుష్ప’ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి తన తోటి స్టార్ హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ విషయం లో పోటీ ఇవ్వడం మొదలెట్టాడో,అప్పటి నుండి ఆయనపై సోషల్ మీడియా లో విష ప్రచారాలు చాలానే జరుగుతున్నాయి.

allu-arjun-farmhouse

సినిమా ఇండస్ట్రీ లో ఎదిగే కొత్తల్లో మెగా ఫ్యామిలీ సపోర్టు తీసుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ కి దూరంగా జరుగుతున్నాడని, ప్రస్తుతం మెగా, అల్లు కుటుంబాల మధ్య సఖ్యత లేదని సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే మెగా ఫ్యామిలీ తో తమకి ఎలాంటి విభేదాలు లేవని అల్లు అర్జున్ రీసెంట్ గా జరిగిన ఫంక్షన్స్ కి హాజరవుతూ గాసిప్స్ పుట్టిస్తున్న వారికి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పాడు. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ పై మరో కొత్త రూమర్ సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అవుతుంది.

allu-arjun-wife-sneha-reddy

అదేమిటంటే అల్లు అర్జున్ హైదరాబాద్ లో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ లో అర్థ రాత్రులు తన భార్య పిల్లలతో కలిసి పూజలు జరిపిస్తున్నాడని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ (Allu Arjun Farmhouse). ఆయన జాతకం లో పలు దోషాలు ఉన్నాయి అట. అవి కెరీర్ కి అడ్డుకట్టగా నిలిచే అవకాశాలు ఎక్కువ ఉందని ఒక ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పడంతో అల్లు అర్జున్ ఈ పూజలు నిర్వహిస్తున్నాడని, ప్రతీ రోజు అర్థరాత్రి పూట ఈ పూజ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని, విజయవంతంగా ఈ పరిహార పూజలు పూర్తి చేస్తే, అల్లు అర్జున్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏలే రేంజ్ కి వెళ్తాడని జ్యోతిష్యుడు అన్నాడట.

allu-arjun

అందుకే అల్లు అర్జున్ గత కొద్దిరోజుల నుండి తన ఫామ్ హౌస్ లో ఈ పూజలు నిర్వహిస్తున్నాడని, ఈ పూజ కార్యక్రమాల్లో ఆయన తల్లి నిర్మల కూడా హాజరు అవుతుందని సమాచారం. అయితే ఎన్ని రోజుల పాటు ఈ పూజ కార్యక్రమాలు జరుగుతాయి అనేది క్లారిటీ లేదు, మరి ఇండస్ట్రీ లో జోరుగా ప్రచారం అవుతున్న ఈ రూమర్ ఎంత వరకు నిజమో చూడాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts