Wednesday, September 18, 2024
HomeCinemaNayanthara: అర్థరాత్రి పూట నడి రోడ్డు మీద నయనతార కి అక్కడేమి పని..?

Nayanthara: అర్థరాత్రి పూట నడి రోడ్డు మీద నయనతార కి అక్కడేమి పని..?

Nayanthara: సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ఉన్న హీరోయిన్స్ అతి తక్కువ మంది ఉంటారు. వారిలో ఒకరు నయనతార. కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం కాకుండా, వైవిద్యభరితమైన పాత్రలను పోషిస్తూ ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ అనే రేంజ్ కి ఎదిగింది(Nayanthara At Night). టాలీవుడ్ , కోలీవుడ్ లలో దాదాపుగా ప్రతీ స్టార్ హీరో సరసన నటించిన ఈమె ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

nayanathara

రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా, ఆ టీజర్ కి అన్నీ బాషలలో ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న ప్యాచ్ వర్క్ బ్యాలన్స్ ఉండడం తో షూటింగ్ ముంబై లో జరుపుతున్నారు. ఈ షూటింగ్ లో నయనతార కూడా పాల్గొంది. రాత్రి సమయం లో షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి చెన్నై కి వెళ్తున్న సమయం లో మీడియా కి చెందిన కొంత మంది ఆమె ఫోటోలను తీశారు. బ్లూ డ్రెస్ లో చాలా నిర్మలంగా,సింపుల్ గా కనిపిస్తున్న నయనతార లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

nayanathara-roaming-at-night

పెళ్ళైన తర్వాత ఎవరికైనా అందం తగ్గిపోతుంది కానీ, నయనతార(Nayanthara At Night) కి మాత్రం పెరిగిపోయిందని,ఆమె అందంకి సాటి ఎవరూ రారు అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. మరోపక్క అంత అర్థ రాత్రి సమయం లో నడి రోడ్డు మీద తిరగాల్సిన అవసరం ఏమిటని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నయనతార మన తెలుగు లో చివరిసారిగా కనిపించిన చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలుగా అద్భుతమైన నటన కనబర్చింది. గతం లో కూడా ఆమె చిరంజీవి తో ‘సై రా నరసింహ రెడ్డి’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం ‘జవాన్’ తప్ప మరో సినిమాకి సంతకం చెయ్యని నయనతార ని చూస్తుంటే, ఇక సినిమాలకు ఆమె గుడ్ బై చెప్పబోతుందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న చర్చ. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. తాను ఇంకా అదే గర్భ సంచిలో కన్నా పిల్లల్తో అడుగుకోవాలి, సినిమా టైం ఇక నయనతారకు ఐపోయింది అంటున్నారు కొందరు ఫాన్స్. 15 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ ని ఏలిన నయనతార ఇంకా బ్రేక్ వేసినట్టే.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts