Friday, September 20, 2024
HomeCinemaMrunal: బంపర్ ఆఫర్ కొట్టేసిన నటి మృణాల్ ఠాకూర్.. ఆ స్టార్ హీరోతో సినిమా కంఫర్మ్..

Mrunal: బంపర్ ఆఫర్ కొట్టేసిన నటి మృణాల్ ఠాకూర్.. ఆ స్టార్ హీరోతో సినిమా కంఫర్మ్..

Mrunal: ‘సీతారామం’ అనే చిత్రం తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ తొలిసినిమాతోనే కోట్లాది మంది తెలుగు ప్రజల మనసుల్ని దోచుకుంది. నటన మరియు అందం తో కుర్రకారులను కట్టిపారేసింది. అసలు ఇన్ని రోజులు ఈ అందాలతార ఎక్కడ ఉంది అని ఆమె కోసం గూగుల్ లో వెతకగా ఆమె బాలీవుడ్ సీరియల్స్ లో హీరోయిన్ అని తెలిసింది(Mrunal Vijay Devarakonda Combo). అంతే కాకుండా పలు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా చేసింది కానీ పెద్దగా గుర్తింపుని తీసుకొని రాలేదు. తెలుగు న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘జెర్సీ’ సినిమాని హిందీ లో షాహిద్ కపూర్ రీమేక్ చెయ్యగా అందులో హీరోయిన్ గా నటించింది ఈమె.

mrunal-thakur-vijay-new-movie-with-star-hero

తెలుగు లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘జెర్సీ’ చిత్రం హిందీ లో మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ చిత్రం తర్వాత వచ్చిన సినిమానే ఈ సీతారామం చిత్రం. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకి టాలీవుడ్ లో అవకాశాల వెల్లువ కురుస్తుంది. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని కొద్దిరోజుల క్రితమే విడుదల చేసారు. ఇక ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ- పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది మృణాల్ ఠాకూర్.

mrunal-thakur-vijay-devarakonda

వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో ‘గీత గోవిందం’ అనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చింది. మళ్ళీ ఆ కాంబినేషన్ లోనే ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. ఇది ఇలా ఉండగా తొలుత ‘గీత గోవిందం’ సినిమాలో రష్మిక కంటే ముందుగా మృణాల్ ఠాకూర్ నే అనుకున్నారట,కానీ ఆమె డేట్స్ సర్దుబాటు చెయ్యలేక ఆ సినిమాని వదులుకుందట. అసలు రష్మిక కి స్టార్ ఇమేజి ని తెచ్చిపెట్టిన సినిమానే ‘గీత గోవిందం’. అలాంటి సినిమాని మృణాల్(Mrunal Vijay Devarakonda Combo) మిస్ చేసుకోవడం అనేది మామూలు బ్యాడ్ లక్ కాదు. ఆ చిత్రం మిస్ అయ్యినప్పటికీ కనీసం దానికి సీక్వెల్ లో అయినా నటించే అవకాశం దక్కింది.

actress-mrunal

ఈ చిత్రం హిట్ అవుతుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమాలో కూడా రష్మిక ని సెకండ్ హీరోయిన్ గా తీసుకునేందుకు చూస్తున్నారట, మరి ఈమె ఒప్పుకుంటుందో లేదో చూడాలి. మృణాల్ నటిస్తున్న సినిమాలు ఈ ఏడాది రెండు ఉన్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకాండతో కాగా, మరొకటి హాయ్ నాన్న. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ తో నటిస్తున్న సినిమా కూడా ఈ డిసెంబర్ నే రిలీజ్ చేదాం అనుకుంటున్నారు బృందం, ఒక వేళా ఇదే ఐతే డిసెంబర్ లో మృణాల్ వి రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నట్టే.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts