Friday, September 20, 2024
HomeCinemaGenelia: విడాకుల దిశగా అడుగులు వేస్తున్న జెనీలియా.. మొగుడితో గొడవలే కారణమా..

Genelia: విడాకుల దిశగా అడుగులు వేస్తున్న జెనీలియా.. మొగుడితో గొడవలే కారణమా..

Genelia: కేవలం రెండు మూడు సినిమాలతోనే స్టార్ స్టేటస్ ని అందుకునే హీరోయిన్స్ మన టాలీవుడ్ లో చాలా తక్కువమంది ఉన్నారు. వారిలో ఒకరు జెనీలియా. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్ట శంకర్ దర్శకత్వం లో వచ్చిన బాయ్స్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జెనీలియా(Genelia Divorce), ఆ సినిమా పెద్ద హిట్టైన తర్వాత టాలీవుడ్/ కోలీవుడ్ లలో వరుసగా ఆఫర్స్ ని సంపాదించింది. బాయ్స్ చిత్రం తర్వాత తెలుగు లో ఈమె హీరో సుమంత్ తో చేసిన ‘సత్యం’ అనే చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తోనే ఆమె స్టార్ హీరోయిన్ గా మారింది.

genelia-divorce

ఆ తర్వాత ఈమె సాంబ, సై, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ, బొమ్మరిల్లు, ఆరంజ్ వంటి చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో అధిక శాతం సూపర్ హిట్ సాధించిన సినిమాలే ఉన్నాయి. ముఖ్యంగా ‘బొమ్మరిల్లు‘ చిత్రం తో ఆమె కోట్లాది మంది తెలుసు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికీ ఈమెని మన తెలుగు ఆడియన్స్ ‘బొమ్మరిల్లు’ హీరోయిన్ గానే చూస్తారు. అలా కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్న సమయం లో ఈమెకి బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ దక్కింది. అలా ఈమె రితేష్ దేశముఖ్ తో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

genelia-dsouza

అవి హిట్ అయ్యాయా, లేదా ఫ్లాప్ అయ్యాయా అనేది పక్కన పెడితే వీళ్ళిద్దరిని మాత్రం ప్రేమికులను చేసి చివరికి భార్యాభర్తలు అయ్యేలా చేసింది. రితేష్ దేశముఖ్ తండ్రి విలాసరావు దేశముఖ్ నటుడు, మరియు రాజకీయ నాయకుడు కూడా. మహారాష్ట్ర కి ముఖ్యమంత్రి గా కూడా ఆయన పని చేసాడు. అలా ముఖ్యమంత్రి కి కోడలిగా వెళ్లిన జెనీలియా రితేష్ దేశముఖ్ తో అన్యోన్య దాంపత్య జీవితాన్ని కొనసాగించి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. తన కుటుంబం తో సంతోషం గా గడుపుతూ ఈమె దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

genelia-with-family

అయితే ఈమె గత కొంత కాలం గా రితేష్ తో దూరం గా ఉంటున్నట్టు, త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి(Genelia Divorce). వీటిల్లో ఎంత మాత్రం నిజం ఉంది అనేది ఎవరికీ తెలియదు కానీ, ఈమె మాత్రం ఈమధ్య బరితెగించి మరీ ఫోటోలను అప్లోడ్ చేస్తుంది. ఇష్టమొచ్చినట్టు అందాలను ఆరబోస్తూ సినిమాల్లో అవకాశాలు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా చూస్తుంటే రితేష్ తో ఆమె విడాకులు తీసుకుంది నిజమేనేమో అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. అధికారికంగా వారు ప్రకటించే వరకు ఎంచెప్పలేము అంటున్నారు మరి కొందరు ఫాన్స్.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts