Friday, September 20, 2024
HomeCinemaRegina Cassandra: నేను కూడా సన్నీ లియోన్ లాగా అలాంటి సినిమాలు చేయాలి అనుకున్నా..

Regina Cassandra: నేను కూడా సన్నీ లియోన్ లాగా అలాంటి సినిమాలు చేయాలి అనుకున్నా..

Regina Cassandra: అందం తో పాటుగా మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా కెరీర్ లో పైకి రాలేకపోయిన హీరోయిన్స్ లో ఒకరు రెజీనా. ఈమె సుధీర్ బాబు హీరో గా నటించిన ‘శివ మనసులో శృతి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా రెజీనా కి మంచి పేరు వచ్చింది. ఎవరో ఈ కొత్త అమ్మాయి చాలా హాట్ గా ఉంది అని అందరి చేత అనిపించుకుంది. కానీ ఎందుకో ఆమె ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనే నటించింది కానీ, పెద్ద హీరో సినిమాల్లో నటించే ఛాన్స్ మాత్రం అస్సలు దక్కలేదు.

regina

ఇది నిజంగా చాలా దురదృష్ట కరం అనే చెప్పాలి. ఇప్పుడు ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంత మంది హీరోయిన్లను చూస్తే అసలు వీళ్లకు ఈ స్థాయిలో ఉండే అర్హత ఉందా? రెజీనా(Regina Cassandra) లాంటి అమ్మాయిలను ఎందుకు గుర్తించరు అని బాధపడుతూ ఉంటాము. సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి రావాలి అనుకునే అమ్మాయిలకు ఏదైనా టెక్నీషియన్ అవ్వాలని అనుకుంటారు, లేకపోతే హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాలని అనుకుంటారు. కానీ రెజీనా మాత్రం పో* స్టార్ అవ్వాలని అనుకుందట. సన్నీ లియోన్ ని చూసి ఎంత అందంగా ఉందో, ఈమె క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు, నేను కూడా ఈమె లాగ పో* స్టార్ అవ్వాలి అని కలలు కనేదానిని.

regina-actress

అప్పట్లో ఆ పదానికి నాకు అర్థం తెలియకా అలా అనుకున్నాను. తెలిసిన తర్వాత ఛీ అని అనుకున్నాను అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అయితే సినిమాల్లో హీరోయిన్ అయినా తర్వాత ఆమె బోల్డ్ సన్నివేశాలు మతియు రొమాంటిక్ సన్నివేశాలు చేసే విషయం లో చాలా కఠినమైన నియమాలు పెట్టుకుంది అట. మిగిలిన హీరోయిన్స్ లాగ బోల్డ్ గా చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడు అట. కిస్ సీన్స్ అయితే పర్వాలేదు కానీ, ఈమధ్య ఓటీటీ లో అడల్ట్ కంటెంట్ కోసం పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా వేరే లెవెల్ బోల్డ్ గా చేస్తున్నారు.

regina-cassandra

అలా మాత్రం నేను చెయ్యను అంటూ చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు కూడా ఏమి లేవు, హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడం తో చాలా చిత్రాల్లో విలన్ గా కూడా నటించింది రెజీనా. రెజినా(Regina Cassandra) ప్రస్తుతం రెండు తెలుగు మరియు రెండు తమిళ్ సినిమాల్లో నటిస్తుంది. ఈ 4 సినిమాలో రెండు సినిమాలు ఈ ఏడాది మరో రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు హిట్టు కొట్టి మల్లి టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి రెజినా వెళ్తుంది అంటారా.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts