Friday, November 22, 2024
HomeCinemaPrabhas Sreenu : నా భార్య కి అల అయ్యినప్పుడు ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను...

Prabhas Sreenu : నా భార్య కి అల అయ్యినప్పుడు ఎన్టీఆర్ మాట్లాడిన మాటలను మర్చిపోలేను.. ప్రభాస్ శ్రీను ఎమోషనల్ కామెంట్స్..!

Prabhas Sreenu : సెలబ్రిటీస్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే జూనియర్ ఎన్టీఆర్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయనతో పని చేసేవాళ్ళు, ఆయనతో పని చెయ్యని వాళ్ళు కూడా ఎన్టీఆర్(Prabhas Sreenu Jr NTR) టాలెంట్ ని ప్రశంసిస్తూ ఉంటారు. అలాంటి సెలెబ్రిటీల లిస్ట్ తీస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఎన్టీఆర్ లాగ డైలాగ్స్ చెప్పే హీరో కానీ, ఆయన లాగ నటించే నటుడు కానీ నేటి తరం లో లేరని ఇదివరకు ఎంతో మంది సెలెబ్రిటీలు, హీరోలు కూడా చెప్పి ఉన్నారు.

prabhas-sreenu

ఇక ఎన్టీఆర్ తో పని చేస్తున్నప్పుడు ఒక స్టార్ హీరో తో పని చేస్తున్నాం అనే ఫీలింగ్ అసలు కలగదని, మన తోటి స్నేహితులతో కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. రీసెంట్ గా ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రభాస్ శ్రీను కూడా ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ‘యమదొంగ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో ప్రెగ్నన్సీ తో ఉన్న నా భార్య కి అబార్షన్ అయ్యింది. నేను మానసికంగా ఎంతో కృంగిపోయాను.

prabhas-sreenu-sensational-comments-on-jr-ntr

అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వ్యక్తిని, నేనంటే ఎవరో కూడా చాలా మందికి తెలియదు. ఎవరికీ నా బాధ చెప్పుకోవాలో కూడా అర్థం అయ్యేది కాదు. అయితే నా భార్య కి అబార్షన్ అయిన విషయం ఎన్టీఆర్ కి తెలిసింది. వెంటనే నాకు ఫోన్ చేసి, ఏమి బాధపడకు, నీకు త్వరలోనే నాలాంటి కొడుకు పుడతాడు. నీకు ఏ డబ్బు అవసరమైన నన్ను అడుగు, నేను నీ స్నేహితుడిని’ అంటూ ఎన్టీఆర్ నాతో మాట్లాడిన మాటలను ఎప్పుడూ మర్చిపోలేను.

prabhas-sreenu-about-ntr

అంత పెద్ద స్టార్ హీరో ఇండస్ట్రీ లో అసలు ఎలాంటి పాపులారిటీ లేని నాతో అంత చనువుగా మాట్లాడి, నాకు భరోసా ఇవ్వడం ని చూసి లోకం లో ఇంత మంచి(Prabhas Sreenu Jr NTR) మనుషులు కూడా ఉంటారా అని అనిపించింది. ఎన్టీఆర్ గొప్పతనం గురించి అంతకుముందు చాలానే విన్నాను, ఆ తర్వాత కళ్లారా చూసాను.

ఎన్టీఆర్ సెట్స్ లో ఉన్నంత సేపు ఎనర్జీ మామూలుగా ఉండదు. చిన్న పెద్ద అనే తేడా ఆయన దగ్గర ఉండదు. అందరితో చాలా సరదాగా ఉంటాడు’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్ శ్రీను. ఎన్టీఆర్ తో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts