Sunday, October 6, 2024
HomeCinemaKlin Kaara: అచ్చు గుడిన్నట్టు రామ్ చరణ్ లానే ఉన్న కూతురు క్లిన్ కారా.. ఫోటోలు...

Klin Kaara: అచ్చు గుడిన్నట్టు రామ్ చరణ్ లానే ఉన్న కూతురు క్లిన్ కారా.. ఫోటోలు వైరల్..

Ram Charan Daughter Photos: టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జంట రామ్ చరణ్ ఉపాసన. వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని 11 సంవత్సరాలు పూర్తి అయ్యాయి, అయినా కానీ వీళ్లకు పిల్లలు కలగలేదు అంటూ సోషల్ మీడియాలో గతం లో ఎన్నో నెగటివ్ కామెంట్స్ వినిపించేవి. అయితే రీసెంట్ గానే ఈ ఇద్దరు క్లిన్ కారా అనే పసి బిడ్డకి జన్మని ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పసికందు పుట్టినప్పటి నుండి మెగా ఫ్యామిలీ కుటుంబం లో కానీ, అభిమానుల్లో కానీ ఆనందాలు ఆకాశాన్ని అంటాయి. మెగా అభిమానులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా క్లిన్ కారా పేరిట ఆలయాల్లో పూజలు జరిపించి ఘనంగా ఈ భూమి మీదకి ఆహ్వానించారు.

ram-charan-upasana-daughter-klin-kaara

అయితే ఇప్పటి వరకు క్లిన్ కారా కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడానికి ఇష్టపడలేదు ఉపాసన. ఎందుకంటే సంవత్సరం కూడా నిండని బిడ్డ ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తే దిష్టి తగులుతుంది అనే. బిడ్డని ఎత్తుకున్న ఫోటోలు చాలానే అప్లోడ్ చేసింది కానీ, ముఖం కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంది. రీసెంట్ గా ఆమె తన తల్లి తండ్రులు క్లిన్ కారా ని ఎత్తుకొని ఆడిస్తున్న ఫోటలను సోషల్ మీడియా లో షేర్ చేసింది ఉపాసన. ఈ ఫోటోలలో క్లిన్ కారా ముఖాన్ని కవర్ చేస్తూ ఆమె అప్లోడ్ చెయ్యగా అవి తెగ వైరల్ గా మారింది.

ram-charan-daughter-klin-kaara

ఇక అభిమానులు అయితే తొందరగా క్లిన్ కారా ముఖాన్ని చూపించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు(Ram Charan Daughter Photos). ఎప్పుడెప్పుడు తమ మెగా వారసురాలిని చూస్తామా అని ఆత్రుత తో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే కనిపించిన ఆ కాస్త ముఖాన్ని చూసి రామ్ చరణ్ అభిమానులు అచ్చం రామ్ చరణ్ లాగానే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా గతం లో నా కూతురుకి నా పోలికలే వచ్చాయి అంటూ ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం షూటింగ్ లేని సమయం లో ఎక్కువగా క్లిన్ కారా తోనే గడుపుతున్నాడు.

klin-kaara-with-upasana-parents

ఆమెని వదిలి అసలు ఎక్కడకి వెళ్లడం లేదు, గాజు బొమ్మని ఎంత అపురూపం గా చూసుకుంటారో, క్లిన్ కారా అని అలాగే చూసుకుంటున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఆయన శంకర్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొన్నటి ఢాకా విరామం తీసుకుని రామ్ చరణ్ కూతురితో సమయం గడిపేశాడు. ఇపుడు సినిమా షూటింగ్ లకి తిరిగి వచ్చి చాల బిజీ గా ఉన్నాడు. రాజమౌళితో ఏ హీరో సినిమా చేసిన కూడా ఆ హీరో తరువాతి సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది. రామ్ చరణ్ రాజమౌళి తో rrr సినిమా తరువాత శంకర్ గేమ్‌ ఛేంజర్‌ సినిమా రాబోతుంది. మరి ఈ సినిమాతో హిట్ కొట్టి ఆ మూఢనమ్మకాన్ని పోగొడతాడా రామ్ చరణ్.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts