Home Cinema Nora Fatehi: గుంటూరు కారం సినిమాలో మరో బ్యూటీ.. కుర్రాళ్ళకి పండగే..

Nora Fatehi: గుంటూరు కారం సినిమాలో మరో బ్యూటీ.. కుర్రాళ్ళకి పండగే..

nora-fatehi-in-guntur-kaaram

Nora Fatehi Guntur In Kaaram ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ బాబు మూడవ సారి చేస్తున్న చిత్రం ఇది. గతం లో ఆయన త్రివిక్రమ్ తో కలిసి ‘అతడు’ , ‘ఖలేజా’ వంటి సినిమాలు చేసాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఆడలేదు కానీ, మహేష్ బాబు కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. టీవీ టెలికాస్ట్ లో ఈ రెండు సినిమాలు ఎప్పుడొచ్చినా టీఆర్ఫీ రికార్డ్స్ బద్దలవ్వాల్సిందే. ఆ రేంజ్ కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కాబట్టే ఈ చిత్రం పై అంచనాలు ఆ స్థాయిలో ఉన్నాయి.

nora-fatehi-in-guntur-kaaram

ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా అన్నీ ప్రాంతాలకు క్లోజ్ అయిపోయింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 160 కోట్ల రూపాయలకు జరిగిందట. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముందుగా ఈ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది, పూజ హెగ్డే ని మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుండి తప్పుకోవడం తో, సెకండ్ హీరోయిన్ అయినా శ్రీలీల కాస్త మెయిన్ హీరోయిన్ అయ్యింది.

nora-fatehi-mahesh-baabu-guntur-kaaram

ఇక ఆ సెకండ్ హీరోయిన్ రోల్ కి మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మరో లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ చిత్రం లో ఒక ఐటెం సాంగ్ ఉంటుందట. ఆ ఐటెం సాంగ్ లో నోరా ఫతేహి(Nora Fatehi Guntur In Kaaram) మహేష్ తో కలిసి చిందులు వెయ్యబోతున్నట్టు సమాచారం. ఈమె పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ చిత్రం లో కూడా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

mahesh-babu-guntur-kaaram

ఈ చిత్రం తర్వాత వెంటనే ఈ సినిమాలో కూడా చేసే అవకాశం రావడం నోరా ఫతేహి అదృష్టం అనే చెప్పాలి. మరి ఈమె హవా టాలీవుడ్ లో ఎలా కొనసాగబోతుందో రాబొయ్యే రోజుల్లో చూడాలి. ఫాన్స్ మాత్రం చాల ఆగం ఉన్నారు అనే చెప్పాలి, ఎందుకంటే వారానికి ఒకరు సినిమా నుండి తీసేయబడుతున్నారు. ఇప్పటికే నలుగురిని సినిమా నుండి తొలగించారు. మరి నోరా అయినా ఉంటుందో లేదో అని ఫాన్స్ కన్ఫ్యూషన్ లో పడ్డారు.