Friday, September 20, 2024
HomeCinemaRajamouli: టాలీవుడ్ 6 హీరోలతో రాజమౌళి బడా మల్టీస్టార్రర్ చిత్రం.. ఈసారి హాలీవుడ్ రికార్డ్స్ బద్దలే..

Rajamouli: టాలీవుడ్ 6 హీరోలతో రాజమౌళి బడా మల్టీస్టార్రర్ చిత్రం.. ఈసారి హాలీవుడ్ రికార్డ్స్ బద్దలే..

Rajamouli Another Multi Starrer: టాలీవుడ్ లో అసాధ్యం అనుకున్న ఎన్నో పనులను సుసాధ్యం చేసి చూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. నేడు మన తెలుగు సినిమాకి పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు లభించింది అంటే అందుకు కారణం రాజమౌళి మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘మగధీర’ చిత్రం తోనే ప్రపంచం మొత్తం మన సినిమాల వైపు చూసేలా చేసాడు. ఇక ఆ తర్వాత ‘ఈగ’ సినిమాతో మొట్టమొదటిసారి పాన్ ఇండియన్ ఎంట్రీ ఇచ్చాడు. అన్నీ భాషల్లో ఆ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఆ తర్వాత వెంటనే ‘బాహుబలి’ సిరీస్ తో ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి 2000 వేల కోట్ల రూపాయలకు పైగానే వసూళ్లను రాబట్టింది.

director-rajamouli-to-do-multi-starrer-movie-with-these-6-tollywood-heros

ప్రస్తుతానికి ఇండియా లో అత్యధిక వసూళ్లను సాధించి నెంబర్ 1 స్థానం లో ఉన్న సినిమా ఇదే. ఇక రీసెంట్ గా కలలో కూడా సాధ్యం కాదు అనుకున్న ఎన్టీఆర్ – రామ్ చరణ్ మల్టీస్టార్ర్ర్ RRR చిత్రాన్ని తీసి ఈసారి పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ నే ఊపేసాడు. ఇండస్ట్రీ లో దశాబ్దాల నుండి నందమూరి మరియు మెగా ఫ్యామిలీ కి మధ్య బాక్స్ ఆఫీస్ పోరు నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాలకు చెందిన మూడవ తరం హీరోలు ఎన్టీఆర్- రామ్ చరణ్ ఒకప్పుడు కలిసి ఫోటో దిగితే చాలు అనుకునేవాళ్లు ఫ్యాన్స్.

rajamouli-multi-starrer-with-tollwood-heros

కానీ రాజమౌళి వాళ్ళిద్దరినీ పెట్టి మల్టీస్టార్రర్ సినిమా తీసి పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకొని ఆస్కార్ అవార్డు ని కూడా సాధించుకొని తీసుకొచ్చింది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలు కలిసి సినిమా చేస్తారని, దానికి ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని మనం కలలో కూడా ఊహించి ఉండము. కానీ రాజమౌళి ఆ అనితర సాధ్యమైన పనిని కూడా అలవోకగా చేసాడు. అయితే ఇప్పుడు అభిమానుల నుండి రాజమౌళి కి మరో స్పెషల్ రిక్వెస్ట్ వచ్చింది. అదేమిటంటే టాలీవుడ్ లో టాప్ 6 స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరినీ ఒక సినిమాలో పెట్టి అవెంజర్స్ లాంటి సినిమా తియ్యమని కోరుతున్నారు.

rajamouli-multi-starrer

మరి రాజమౌళి తానూ తియ్యబోతున్న మహాభారతం సిరీస్ లో మన టాప్ 6 హీరోలకు అవకాశం దొరుకుతుందో లేదో చూడాలి(Rajamouli Another Multi Starrer). ప్రస్తుతం రాజమౌళి భార్యతో కలిసి పులిపిట్ రాక్ హిల్ అనే ప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ప్రదేశాన్ని రాజమౌళి మగధీర సినిమా చేసే సమయంలో లొకేషన్స్ కోసం చూస్తున్నపుడు దొరికిందంతా, అప్పటి నుండి అక్కడికి వెళ్ళాలి అని కోరిక అంట.

కానీ బిజీ షెడ్యూల్ వాళ్ళ ఎపుడు కుదరలేదు, rrr సినిమా హిట్ తరువాత రాజమౌళి కుటుంబంతో కలిసి వాకాటిన్ కి వెళ్ళాడు, పనిలో పని ఇక్కడికి కూడా వెళ్తే బాగుంటుంది ఏపాటి నుండి అనుకుంటున్నా ఇక్కడికి వెళ్ళాలి అని, సో దొరికిందే ఛాన్స్ అని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు రాజమౌళి. తిరిగి వచ్చాక మహేష్ తో సినిమా షురూ.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts