Home Cinema South Stars: నిశ్చితార్థం తరువాత పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకున్న టాప్ సెలెబ్రిటీలు వీళ్ళే..

South Stars: నిశ్చితార్థం తరువాత పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకున్న టాప్ సెలెబ్రిటీలు వీళ్ళే..

south-indian-stars-who-got-engaged-with-their-loved-ones-but-cancelled-their-marriage-in-the-last-minute

South Stars: టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు కొత్తేమి కాదు. సినిమా షూటింగ్ అంటే నెలల తరబడి కలిసి చేసే ప్రయాణం. ఈ ప్రయాణం లో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ పుట్టొచ్చు, అందులో వింతేమీ లేదు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంతమంది హీరోలు హీరోయిన్లు ఎంతో సుఖంగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ కొంతమంది మాత్రం తమ మధ్య సఖ్యత చోటు చేసుకోకపోవడం తో పెళ్ళైన రెండు మూడేళ్లకే విడిపోతున్నారు(South Stars Cancelled Marriages). మరి కొంతమంది అయితే ప్రేమించుకొని, నిశ్చితార్థం కూడా చేసుకొని పెళ్లిని రద్దు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము.

akhil-akkineni-south-stasr-who-cancelled-marriages-after-engagement

అక్కినేని అఖిల్ : సమంత మరియు నాగ చైతన్య పెళ్లి తో పాటుగా అఖిల్ పెళ్లి కూడా జరగాల్సి ఉంది. శ్రీయ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించిన ఈయన, ఇంట్లో వాళ్ళతో చెప్పి పెళ్లి కి ఒప్పించాడు. గ్రాండ్ గా వీళ్లిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇటలీ లో గ్రాండ్ గా వీళ్లిద్దరి పెళ్లి జరిపించాలని అనుకున్నారు. కానీ ఇరువురి కుటంబాల మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా వీళ్లిద్దరి పెళ్లి పెటాకులు అయ్యింది.

rashmika-south-stars-who-cancelled-marriages-after-engagement

రష్మిక మండన: ఈమె ప్రముఖ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ని ప్రేమించింది, వీళ్లిద్దరు కలిసి అప్పట్లో ‘కిరిక్ పార్టీ’ అనే సినిమా చేసారు. ఈ సినిమానే రష్మిక కి మొదటి సినిమా కూడా, వీళ్లిద్దరి మధ్య ప్రేమ కూడా ఈ సినిమా షూటింగ్ సమయం లోనే అయ్యింది. ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు, కానీ ‘గీత గోవిందం’ సినిమా సమయం లోనే వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది.

trisha-south-stars-who-cancelled-marriages-after-engagement

త్రిష : సౌత్ లో బడా స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగిన త్రిష, ఎంతో మంది స్టార్ హీరోలతో అఫైర్స్ నడిపింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. సుచీ లీక్స్ లో ఎక్కువగా ఈమె ఫొటోలే కనిపిస్తాయి. అయితే వాళ్ళెవ్వరిని పెళ్లి చేసుకోలేదు కానీ, చివరికి తన చిన్న నాటి స్నేహితుడు వరుణ్ మణియన్ ని ప్రేమించి పెళ్లాడాలని అనుకుంది. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది, కానీ పెళ్లి దాకా వెళ్ళలేదు.

mehreen-

మెహ్రీన్ : ఈ హాట్ బ్యూటీ కూడా ఈమధ్యనే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవడు, కాంగ్రెస్ పార్టీ నేత భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం చేసుకొని, ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే.

vishal

విశాల్ : తెలుగు తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉన్న హీరో విశాల్ అనీషా రెడ్డి అనే అమ్మాయి తో ప్రేమలో పడి, దాదాపుగా ఆరేళ్ళు డేటింగ్ చేసుకొని, పెద్దల అంగీకారం తో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు(South Stars Cancelled Marriages). కానీ వీళ్లిద్దరి బంధం పెళ్లి దాకా వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయింది. అనిషా రెడ్డి అరుజున్ రెడ్డి సినిమాలో కనిపించింది