Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లో ప్రతీ సెలబ్రిటీ తో ఎంతో మంచి స్నేహం గా ఉంటాడనే విషయం మన అందరికీ తెలిసిందే. ప్రతీ హీరో కి బెస్ట్ ఫ్రెండ్ గా రామ్ చరణ్ కచ్చితంగా ఉంటాడు. తనతో పోటీ పడే హీరోలలో అందరూ కూడా రామ్ చరణ్ కి మంచి స్నేహితులే. సంస్కారానికి పెట్టింది పేరు లాంటి వాడని అక్కినేని నాగార్జున వంటి లెజెండ్స్ కూడా పబ్లిక్ స్టేజి మీద అన్నారంటే రామ్ చరణ్ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు(Ram Charan Meeting Tamannaah). కేవలం హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్స్ కి కూడా రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం.
అతని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్ జాబితా తమన్నా కూడా ఉంది. ఈమెతో రామ్ చరణ్ కేవలం ‘రచ్చ’ అనే చిత్రం మాత్రమే చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది కానీ, మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. అయినప్పటికీ కూడా వీళ్లిద్దరి మధ్య ఇంత పెద్ద రిలేషన్ ఉందా అని తమన్నా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పే వరకు ఎవరికీ తెలియదు. యాంకర్ మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యినప్పుడు కానీ, నిరాశలో ఉన్నప్పుడు కానీ ఎవరితో మాట్లాడితే ఫ్రీ అవుతారు అని అడగగా.
తమన్నా సెకండ్ కూడా ఆలోచించకుండా రామ్ చరణ్ పేరు చెప్తుంది. నేను ఎంత ఒత్తిడికి గురి అయినా, సమయం సందర్భం లేకుండా రామ్ చరణ్ కి ఫోన్ చేసి మాట్లాడుతాను(Ram Charan Meeting Tamannaah). రామ్ చరణ్ కూడా తానూ ఎంత బిజీ గా ఉన్నా కూడా నా ఫోన్ కాల్ కి సమాధానం ఇచ్చి మాట్లాడుతాడు. అర్థ రాత్రులు కూడా చరణ్ కి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అతనితో మాట్లాడిన తర్వాత నాలో ఉన్న ఒత్తిడి, బాధ అంత మర్చిపోతాను అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఆమె మాట్లాడిన ఈ మాటలు వింటే రామ్ చరణ్ ఆమెకి ఎంత దగ్గరి మనిషో అర్థం అవుతుంది.
వీళ్లిద్దరు ఇలా అర్థ రాత్రులు ఫోన్ కాల్ మాట్లాడుకుంటారు అనే విషయం ఉపాసన కి తెలుసా తెలియదా..? ఒకవేళ తెలియకుండా మాట్లాడుకుంటే తమన్నా ఇప్పుడు ఆ విషయం ని లీక్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా లో హీరో గా నటిస్తున్నాడు. మొన్నటి వరకు ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది అనే న్యూస్ ఫుల్ వైరల్ అయ్యింది.
కానీ అలాంటిది ఎం లేదు అని సినిమా బృందం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేదాం అని అనుకుంటున్నారు అంట సినిమా నిర్మాతలు. ఈ సినిమా హిట్ అవ్వాలి అని మేము అందరం కోరుకుంటున్నాము.