NTR : స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, నూనూగు మీసాల వయస్సులోనే బిగ్గెస్ట్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి రికార్డ్స్ తో చెడుగుడు ఆదుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. 2001 వ సంవత్సరం లో ‘నిన్ను చూడాలని’ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్, 2002 వ సంవత్సరం లో ‘ఆది’ చిత్రం తిరుగులేని మాస్ హీరో గా ఎదిగాడు(NTR Mood Off). ఆ తర్వాత ఎన్నో మాస్ హిట్స్ ని అందుకొని నేడు ప్రపంచవ్యాప్తంగా తన అద్భుతమైన నటనతో గ్లోబల్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అంటే కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.
నందమూరి కుటుంబం నుండి వచ్చిన ఒక కుర్రాడు ఈ స్థాయికి చేరుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రతీ విషయం అభిమానులకు బాగా తెలుసు, కానీ ఆయన గురించి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఇక అసలు విషయానికి వస్తే సెలబ్రిటీ జీవితం లో పాజిటివిటీ అనేది ఎంత ఉంటుంది నెగటివిటీ కూడా అంతే ఉంటుంది. ఒక్కోసారి నెగటివ్ కామెంట్స్ ని విన్నప్పుడు కానీ , చూసినప్పుడు కానీ మూడ్ చెడిపోవడమా నేది సర్వసాధారణం. అలా ఎన్టీఆర్ కి కూడా అప్పుడప్పుడు మూడ్ చెడిపోతూ ఉంటుందట.
అలా మూడ్ బాలేనప్పుడు అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఎన్టీఆర్ తన గదిలోకి వెళ్ళిపోయి టీవీ పెట్టుకొని ఆన్లైన్ లో ఏదైనా మంచి సినిమాని చూసి తన మైండ్ ని రిలాక్స్ చేసుకుంటాడట(NTR Mood Off). ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అందుకే ఎప్పుడూ ఆయన అంత ఎనర్జీ తో కనిపిస్తాడట. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ అనే చిత్రం లో హీరోగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ బుల్లెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది, ఇప్పటికే ఆరు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు 7 వ షెడ్యూల్ ని జరుపుకుంటుంది.
డిసెంబర్ లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో పెద్ద కలిసి రాక, తల్లి దారిలోనే తిను కూడా టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ సినిమా గాని హిట్ ఐతే ఇక తిను టాలీవుడ్ సినిమాలే చేస్తుంది అట.
అంతే కాకుండా ఈ సినిమా హిట్ అవ్వాలి అని తిను ఇప్పటికే 2-3 సార్లు తిరుమల కి వెళ్లి కూడా మొక్కుకుంది. మేము కూడా ఈ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాము. అవుతుంది కూడా.