Tuesday, November 26, 2024
HomeCinemaPrabhas : పెళ్లి పీటలెక్కబోతున్న ప్రభాస్.. అనుష్కతో కాదు అమ్మాయి ఎవరంటే..

Prabhas : పెళ్లి పీటలెక్కబోతున్న ప్రభాస్.. అనుష్కతో కాదు అమ్మాయి ఎవరంటే..

Prabhas: దర్శకధీరుడు రాజమౌళి తెరెక్కించిన బాహుబలి సిరీస్ తో ప్రభాస్ రేంజ్ ప్రపంచం నలుమూలలకు చేరింది. ఆ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. కెరీర్ పరంగా హైప్ లో ఉన్నా. నాలుగు పదుల వయసు వచ్చిన ఆయన ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. కెరీర్ పరంగా చాలా బాగా ఉన్నా ఆయన పెళ్లి చేసుకోకపోవడం తన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది(Prabhas Marriage). ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసినా అవి కార్యరూపం దాల్చలేదు.

prabhas

ఇది ఇలా ఉంటే ప్రభాస్ అనుష్కతో లవ్ లో ఉన్నాడని ఆమెతోనే పెళ్లి అవుతుందని చాలా రూమర్ల వచ్చాయి. ఆ విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకుండా ఇద్దరి పెళ్లి గురించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పకుండా వారిద్దరు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయారు. ఇక మరికొద్ది రోజుల్లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. హిట్ ప్లాపులతో సినిమాలు చేసుకుంటూ పోతున్నప్పటికీ ప్రభాస్ లైఫ్ కి సంబంధించిన ముఖ్య నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రభాస్ అనుష్క జోడి ఒక్కటైతే బాగుండని వారి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

prabhas-anushka-shetty

అభిమానులకు ఈ ఆశ తీరేటట్లు కనిపించడం లేదు. ఇందుకు కారణం తాజాగా ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం. ప్రభాస్ కి అనుష్కతో కాకుండా ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదట(Prabhas Marriage).. తమ బంధువులు అమ్మాయనని తెలుస్తోంది. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామల దేవినే ఇక ఈ పెళ్లి సంబంధం సెట్ చేసిందట. శ్యామల దేవి ఓ ఫంక్షన్ కు వెళ్లినప్పుడు ఆ అమ్మాయి ఫోటో తనకు చూపించారట. ఇక ఆ ఫోటో చూసిన వెంటనే శ్యామలా దేవికి బాగా నచ్చిందట.

prabhas

వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఈ విషయం చెబితే అంతా మీ ఇష్టం అన్నట్లు తెలుస్తోంది. ఫోటోలో చూసిన అమ్మాయి కూడా ప్రభాస్ కి బాగా నచ్చి ఓకే అనేశారట. ఇక ఆ అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో బిజినెస్ కు సంబంధించిన కోర్స్ చదువుతోందట. తన చదువు అయిపోయిన వెంటనే అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత ప్రభాస్ కు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని శ్యామలా దేవి నిర్ణయించారట. పెళ్లి విషయంలో ప్రభాస్ పెద్దమ్మ మాటే ఫైనల్ అన్నట్లు మాట్లాడడంతో శ్యామలా దేవి కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారట.

ప్రభాస్ పెళ్లి వార్త విన్న కొంతమంది అభిమానుల చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి కొంతమంది మాత్రం అనుష్కను పెళ్లి చేసుకోకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయితే ప్రభాస్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ ఇప్పటికే ఎన్నో మార్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. మరి తాజాగా ప్రచారం జరుగుతున్న వార్తలోనైనా నిజం ఎంతుందో చూడాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts