Senior NTR : స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సినీ వినీలాకాసం లో మకుటం లేని మహారాజు గా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్, ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసి తెలుగు దేశం పార్టీ ని స్థాపించి, ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. చరిత్ర లో ఎవ్వరూ కూడా ఇలాంటి హిస్టరీని రిపీట్ చేయలేకపోయారు. ఆయన స్థాయి అలాంటిదిమరి(Senior NTR Breakfast). ఎన్నో సంక్షేమ పథకాలతో కోట్లాది మంది తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవంగా మారిన ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం ప్రతీ ఒక్కరికి తెరిచినా పుస్తకం లాంటిదే.
అయితే ఆయన ఆహారపు అలవాట్లు గురించి రీసెంట్ గా సోషల్ మీడియా లో బయటపడిన కొన్ని నిజాలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. స్వతహాగా ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు, ఈ విషయం ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుసు. ఆయన సోదరుడు త్రివిక్రమరావు ఒకానొక సందర్భం లో ఎన్టీఆర్ తీసుకునే ఆహారం గురించి చెప్పుకొస్తాడు. ఎన్టీఆర్ తెల్లవారు జామున నాలుగు గంటలకే నిద్ర లేచేవాడట. నిద్ర లేచిన వెంటనే వ్యాయామం చేసి, అప్పుడే తీసిన ఆవుపాలు ని నురగగా ఉన్నప్పుడే నేరుగా త్రాగేసేవాడట. ఆ తర్వాత అరటిపండు, యాపిల్ కాయ త్రినేవాడట.
ఇక బ్రేక్ ఫాస్ట్ చేసే సమయానికి ఆయనకీ కనీసం మూడు రకాల టిఫిన్లు కచ్చితంగా ఉండాల్సిందేనట. ఎక్కువగా ఆయన ఊతప్పం, దోస మరియు వడ తినడానికి ఇష్టపడేవాడట(Senior NTR Breakfast). ప్రతీ రోజు ఆయన టిఫిన్ మెన్యు లో ఇవి ఉండేవట. ఇక టిఫిన్ లోకి ఆయన మనలాగా పల్లి చట్నీ, అల్లం పచ్చడి వేసుకొని తినడు. చికెన్ గుజ్జుతో పాటుగా, చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై మరియు మేక కాళ్ళు నుండి తీసిన గుజ్జు (ములుగు) ని ఆయన కోసం కూరగా చేసేవారట. ఇవన్నీ టిఫిన్ లో నంచుకుని తినేవాడట ఎన్టీఆర్. అలా ఉదయం 7:30 గంటలకు బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని షూటింగ్ కి వెళ్లేవాడట.
షూటింగ్ కి వెళ్లిన తర్వాత నిర్మాతలు రకరకాల హోటల్స్ నుండి ఎన్నో రుచికరమైన వంటకాలు ఎన్టీఆర్ కి లంచ్ కోసం తెప్పించేవారట. వీటితో పాటుగా అభిమానులు ఎన్టీఆర్ కోసం తెచ్చే క్యారేజిలను కూడా తినేవాడట. అలా లంచ్ కి ఎన్ని వంటకాలు వచ్చినా తింటూనే ఉండేవాడట. భోజనం మొత్తం అయిపోయాక ఒక లీటర్ జ్యూస్ ఆపకుండా త్రాగేవాడట. ఎన్టీఆర్ కి ఉన్న ఈ ఆహారపు అలవాట్లు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనం ఎన్ని మాట్లాడుకున్న తక్కువే. ఒక హీరో సీఎం అయ్యి అంత మంది ప్రజల ప్రేమను పొందటం మామూలు విషయ కాదు. చనిపోయారు కానీ బతికి ఉండివుంటే కచ్చితంగా ప్రధాన మంత్రి అయ్యే వారు. ఒక తెలుగోడు ప్రధాన మంత్రి అంటే మనకు అసలు ఎంత గర్వకారణం కానీ ఆ అదృష్టాన్ని మనం మిస్ అయిపోయాము.