Saturday, September 21, 2024
HomeCinemaRakul Preet : కొత్త కారు కొనుగోలు చేసిన రకుల్.. కొత్త ప్రియుడు గిఫ్ట్ ఇచ్చాడా..?

Rakul Preet : కొత్త కారు కొనుగోలు చేసిన రకుల్.. కొత్త ప్రియుడు గిఫ్ట్ ఇచ్చాడా..?

Rakul Preet : కేవలం రెండు మూడు సినిమాలతోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకోవడం హీరోయిన్స్ కి చాలా కష్టమైన విషయం. అలాంటి అదృష్టం అందరి హీరోయిన్స్ కి రాదు, కేవలం ఒకరిద్దరి హీరోయిన్స్ కి మాత్రమే వస్తుంది. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ‘కెరటం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె, ఆ తర్వాత ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సూపర్ హిట్ ని అందుకొని మంచి క్రేజ్ ని దక్కించుకుంది(Rakul Preet new car). ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హిట్ మీద హిట్ కొట్టి ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మారింది.

rakul-preet-singh

తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం లో కూడా ఈమె దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించేసింది. ఇప్పుడు కమల్ హాసన్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఇండియన్ 2 ‘ లో కూడా నటిస్తుంది. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ చాలా కాలం నుండి జాకీ భగ్నానీ అనే అతనితో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. వీళ్లిద్దరు కలిసి తిరిగిన ఫోటోలు మరియు వీడియోలు రకుల్ ప్రీత్ సింగ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఇప్పటికీ ఉన్నాయి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కు ఒక ప్రియుడు ఉన్నాడు అని మనందరికీ తెలుసు.

rakul-preet-secret-affair-with-that-hero-who-gifted-her-new-car

అయినప్పటికీ ఒక ప్రముఖ స్టార్ హీరోతో చాలా కాలం నుండి సీక్రెట్ రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్(Rakul Preet new car). రీసెంట్ గా రకుల్ బెంజ్ సిరీస్ లో లేటెస్ట్ మోడల్ కార్ ని కొనుగోలు చేసింది. ఈ కారుతో ఆమె సెల్ఫీ లు దిగడం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఈ కారుని ఆమె రహస్య ప్రేమికుడిగా పిలవబడే ఆ స్టార్ హీరోనే బహుమతిగా ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మరి ఆ రహస్య ప్రేమికుడు ఎవరు ఏమిటి అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు అనే విషయం అందరికీ తెలిసిందే.

rakul-preet-singh-purchases-new-car

ఈమె ఫోకస్ మొత్తం ఇప్పుడు బాలీవుడ్ వైపు షిఫ్ట్ అయ్యింది. కానీ అక్కడ కూడా ఈమెకి సక్సెస్ లేదు, దీంతో ఈమె ఎలాంటి పాత్ర ఇచ్చిన చేస్తాను అంటూ ఒక ఆఫర్ ఇచ్చింది. మరి ఆమె ఆఫర్ ని మెచ్చి ఏ డైరెక్టర్ అయినా అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన రకుల్ ఇపుడు ఇలా ఉండటం చూసి ఫాన్స్ ఎంతో బాధపడుతున్నారు. తమ హీరోయిన్ కూడా ఇతర హీరోయిన్ అనుష్క, కాజల్ లాగ కంబ్యాక్ ఎపుడు ఇస్తుందో అని వేచి చూస్తున్నారు.

మరి నటి రకుల్ ప్రీత్ సింగ్ కు ఇతర హీరోయిన్ లలాగా కంబ్యాక్ సినిమా ఇప్పట్లో వస్తుది అంటారా..? ఇపుడు ఉన్న కుర్ర హీరోయిన్ లు గెట్టి కంపిటేషన్ ఏ ఇస్తున్నారు కాబట్టి కష్టమే అని అనుకుంటున్నారు అట అభిమానులు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts