Sunday, September 29, 2024
HomeCinemaSrihari : శ్రీహరి పెట్టె టార్చర్ భరించలేక పారిపోయిన రామ్ చరణ్.. అసలు ఏమైందంటే..

Srihari : శ్రీహరి పెట్టె టార్చర్ భరించలేక పారిపోయిన రామ్ చరణ్.. అసలు ఏమైందంటే..

Srihari-Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు రియల్ స్టార్ శ్రీహరి మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘మగధీర’ మరియు ‘తూఫాన్’ వంటి చిత్రాలు వచ్చాయి. అందులో మగధీర చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయగా, ‘తూఫాన్’ చిత్రం భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. వీళ్లిద్దరి మధ్య బాండింగ్ కేవలం ఈ రెండు సినిమాల వల్ల ఏర్పడలేదు, చిరంజీవి కొడుకు కారణంగా శ్రీహరి తో రామ్ చరణ్ కి చిన్నతనం నుండే మంచి పరిచయం ఉంది.

ram-charan-chiranjeevi

అయితే రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీ కి రాబొయ్యే ముందు చిరంజీవి శ్రీహరి కి ఫోన్ చేసి, మా అబ్బాయికి జిమ్నాస్టిక్స్ మరియు ఫిట్నెస్ లో ట్రైనింగ్ కావాలి, అవి ఇండస్ట్రీ లో నీకు తెలిసినంత ఎవరికీ తెలియదు, త్వరలోనే మావాడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు, నువ్వే ఇవన్నీ చూసుకోవాలి అని శ్రీహరి తో చెప్పాడట. చిరంజీవి ని తన సొంత అన్నయ్య కంటే ఎక్కువగా భావించే శ్రీహరి, ఆయన ఏది చెప్పినా చెయ్యడానికి ఇష్టపడతాడు. అలాగే రామ్ చరణ్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు(Srihari Ram Charan). రామ్ చరణ్ చాలా రోజుల పాటు శ్రీహరి ఇంటికి వెళ్లి వర్కౌట్స్ మొత్తం నేర్చుకున్నాడు.

srihari-ram-charan

అయితే చిరంజీవి గారు ఇచ్చిన బాధ్యత కాబట్టి, మొదటి రోజు నుండే రామ్ చరణ్ చేత కఠినమైన వర్కౌట్స్ చేయించేవాడట శ్రీహరి. రామ్ చరణ్ అవి తట్టుకోలేక రెండు రోజుల తర్వాత నేను శ్రీహరి గారి దగ్గరకి వెళ్ళను బాబోయ్, పిండేసాడు అని చిరంజీవి తో అన్నాడట. అప్పుడు చిరంజీవి రామ్ చరణ్ కి బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ పంపించాడట. అలా వర్కౌట్ టెక్నీక్స్ మొత్తం రామ్ చరణ్ శ్రీహరి వద్దనే నేర్చుకున్నాడు. ఈ విషయం చాలా కాలం తర్వాత బయటపడి సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరు శ్రీహరి మరియు రామ్ చరణ్ మధ్య ఇంత మంచి సాన్నిహిత్యం ఉందా అని ఆశ్చర్యపోయారు.

srihari-family

అంతే కాదు మగధీర సినిమా షూటింగ్ సమయం లో రామ్ చరణ్ కి పోరాట సన్నివేశాల షూటింగ్ ఉన్నప్పుడు శ్రీహరి అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. రోప్స్ సరిగా ఉన్నాయా లేవా అనేది స్వయంగా ఆయనే పరిశీలించేవాడు. రామ్ చరణ్ ని తన సొంత బిడ్డలాగా చూసుకునేవాడు శ్రీహరి. రామ్ చరణ్ తరువాత సినిమా డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు. గేమ్‌ ఛేంజర్‌ అనే ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవ్వాల్సి ఉంది.

కానీ రామ్ చరణ్ కి కూతురు పుట్టడంతో తాను మధ్య కొన్నాళ్ళు సినిమాల నుండి విరామం తీసుకున్నాడు దీనితో సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోనే చేసారు సినిమా బృందం. ఫాన్స్ మాత్రం కూతురు పుట్టింది అని సంతోషం మరో పక్క సినిమా రిలీజ్ అవ్వటం లేదు అని బాధలో ఉన్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts