Home Cinema Vijay Devarakonda: కారు పై మూత్రం పోసిన విజయ్ దేవారకొండ..

Vijay Devarakonda: కారు పై మూత్రం పోసిన విజయ్ దేవారకొండ..

vijay-devarakonda-in-an-interview-with-rana-reveals-he-urnitaed-standing-on-car

Vijay Devarakonda: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. హిట్ మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఇతనికి ఉన్న క్రేజ్ ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పెద్ద కుటుంబం నుండి వచ్చిన వాళ్లకు బ్యాక్ గ్రౌండ్ ఇమేజి ఉంటుంది కాబట్టి ఎన్ని ఫ్లాప్స్ పడినా ఇబ్బంది ఉండదు. కానీ ఒక బ్యాక్ గ్రౌండ్ లేని హీరో కి వరుసగా డిజాస్టర్స్ వస్తున్నా ఇమేజి చెక్కు చెదరలేదు అంటూ, కచ్చితంగా గ్రేట్ అనే చెప్పాలి(Vijay Devarakonda On Car). కెరీర్ ప్రారంభం లో నిలదొక్కుకోడానికి విజయ్ దేవరకొండ తనకి వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకున్నాడు.

vijay-devarakonda

చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ వచ్చినా చేసాడు. అలా న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి మంచి గుర్తింపుని దక్కించుకున్న విజయ్ దేవరకొండ, ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో మొట్టమొదటిసారి హీరో గా వెండితెర పై కనిపించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి విజయ్ దేవరకొండ ని హీరో గా నిలబెట్టింది. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ ఇలా వరుసగా రెండు భారీ బ్లాక్ బస్టర్స్ రావడం తో యూత్ ఐకాన్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ.

vijay-devarakonda-vd13

అతనికి ఇంత క్రేజ్ రావడానికి కచ్చితంగా ఆ రెండు సినిమాలు ప్రధాన కారణం అని చెప్పొచ్చు కానీ, వాటితో పాటుగా అతనికి బయట ఉన్న డిఫరెంట్ యాటిట్యూడ్ కూడా తనని ఈ రేంజ్ లో నిలబెట్టడానికి కారణం అయ్యాయి అని చెప్పొచ్చు. ఇక పోతే ఇతనితో ఇంటర్వ్యూ చేస్తే బోలెడంత కంటెంట్ వచ్చినట్టే. ప్రతీ ప్రశ్నకి విచిత్రమైన సమాధానం ఇస్తాడు. అప్పట్లో విజయ్ దేవరకొండ ‘నెంబర్ 1 యారి విత్ రానా ‘ అనే టాక్ షో లో పాల్గొన్నాడు. ఇందులో రానా ర్యాపిడ్ ఫైర్ సెక్షన్ లో అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ చాలా క్రేజీ సమాదానాలు చెప్తాడు. ‘నీ జీవితం లో నువ్వు చేసిన అత్యంత క్రేజీ పని ఏమిటి?’ అని రానా అడగగా.

vijay-devarakonda-in-an-interview-with-rana-reveals-he-urnitaed-standing-on-car

దానికి విజయ్ దేవరకొండ సమాధానం చెప్తూ ‘కారు పైకి ఎక్కి మూత్రం పొయ్యడం’ అంటూ సమాధానం ఇచ్చాడు(Vijay Devarakonda On Car). ఆయన ఇచ్చిన సమాధానం చాలా కాలం తర్వాత మళ్ళీ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన ఖుషి సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. లైగర్ ప్లాప్ అయిన తరువాత ఇంకా అందరూ విజయ్ పని ఐపోయింది అనుకున్నారు.

కాని ఖుషి తో హిట్ కొట్టి నేను ఇంకా రేస్ లో ఉన్నాను అని నిరూపించాడు విజయ్ దేవరకొండ. పూరి తో చెయ్యబోతున్న సినిమా జన గణ మన ఆగిపోవడంతో VD12 సినిమా చేస్తున్నాడు విజయ్.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఫాన్స్ కి పెద్ద అంచనాలే ఉన్నాయి.