Sunday, October 6, 2024
HomeCinemaChiranjeevi: చిరంజీవి కి విషం పెట్టి చంపాలని అనుకున్న ప్రముఖ స్టార్ హీరో.. ఇంత నమ్మకద్రోహమా..

Chiranjeevi: చిరంజీవి కి విషం పెట్టి చంపాలని అనుకున్న ప్రముఖ స్టార్ హీరో.. ఇంత నమ్మకద్రోహమా..

Chiranjeevi: వారసత్వం ఇండస్ట్రీ ని ఏలుతున్న రోజుల్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి ఒక కుర్రాడు వచ్చి, అంతకు ముందు ఉన్న సూపర్ స్టార్స్ అందరికంటే మిన్నగా నటిస్తూ, అనతి కాలం లోనే మెగాస్టార్ గా ఎదిగి నాలుగు దశాబ్దాల పాటు నెంబర్ 1 హీరో గా కొనసాగాడు. అలాంటి హీరో మీద అసూయ పడకుండా ఎవరుంటారు చెప్పండి. పైగా ఇండస్ట్రీ మొత్తం ఒక సామజిక వర్గానికి పరిమితమైన సంగతి అందరికీ తెలిసిందే(Chiranjeevi Poison). డైరెక్టర్లు, నిర్మాతలు మరియు హీరోలు ఇలా ప్రతీ ఒక్కరు కూడా 90 శాతం ఒక సామజిక వర్గానికి సంబంధించిన వారే.

chiranjeevi

చిరంజీవి బయట సామాజిక వర్గం నుండి వచ్చి సక్సెస్ అయినా వ్యక్తి. అది కూడా మామూలు సక్సెస్ కాదు, తెలుగు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే తెలుగు సినిమా అనే రేంజ్ క్రేజ్/ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అలాంటి సూపర్ స్టార్ అంటే పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చిరంజీవి ఎదుగుదల ని తట్టుకోలేక, ఒక ప్రముఖ స్టార్ హీరో మెగాస్టార్ పై హత్యాయత్నం కూడా చేసాడు. అసలు విషయం లోకి వెళ్తే అప్పట్లో ఆ స్టార్ హీరో ఇండస్ట్రీ లో జున్న అందరికి తన కూతురు పుట్టినరోజు సందర్భంగా పార్టీ రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు.

megastar-chiranjeevi

అలా చిరంజీవి కి కూడా ఆహ్వానం దక్కింది. ఇంటికి వచ్చిన చిరంజీవి కి తినే ఆహరం లో విషం పెట్టి చంపాలని ఆ స్టార్ హీరో ప్లాన్ చేసాడు(Chiranjeevi Poison). కానీ చిరంజీవి కి అప్పుడు ఒంట్లో బాగాలేకపోవడం తో నేనేమి తినలేనని చెప్పాడట. పార్టీ కి వెళ్లి కేవలం ఆయన కూతురుకి ఆశీర్వాదం ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత చిరంజీవి కి ఈ విష ప్రయోగం గురించి తెలిసిందట. అది తెలుసుకున్నాక చిరు చాలా బాధపడ్డాడట, ఆంజనేయ స్వామి దయ వల్ల ఆరోజు ఆ ఇంట్లో ఏది ముట్టుకోలేదు అని తన సన్నిహితులతో అన్నాడట. ఇంత కుట్రలు చేసాడని తెలిసినా కూడా చిరంజీవి ఆ స్టార్ హీరో పట్ల ఇంకా స్నేహ భావం తోనే ఉన్నాడు.

mega-star-chiranjeevi

ఇప్పటికీ కూడా తన తోటి సోదరుడు లెక్కనే గౌరవిస్తాడట మెగాస్టార్. ఇంతటి ఔదార్యం చిరంజీవి లో ఎక్కడిది అని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అంత మంచితనం కూడా పనికిరాదని అంటున్నారు. చిరంజీవి తరువాయి సినిమా మెగా 157. వసిస్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ప్రకటించలేదు.

అంతే కాకుండా చిరంజీవి పూరి జగన్నాద్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా పేరే ఆటో జానీ, ఈ సినిమాలో నయనతారని హీరోయిన్ గా ఎంపికచేసుకున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు రావలసి ఉంది. పూరి చిరు కాంబినేషన్ సినిమా అంటే కచ్చితం బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts