Rashi Khanna : ఇతర రాష్ట్రాలకు చెందిన హీరోయిన్స్ మన తెలుగు సినీ పరిశ్రమకి వచ్చి, ఇక్కడే అత్యంత క్రేజ్ మరియు పాపులారిటీ ని సంపాదించుకొని, జీవితం లో అత్యున్నత స్థాయికి వెళ్లిన హీరోయిన్లు(Rashi Khanna Comments on Tollywood) ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి ఇక మన సౌత్ లో కెరీర్ లేదు అనే విషయం అర్థం అయ్యాక, మన ఇండస్ట్రీస్ పై తమ మనసులో ఉన్న విషాన్ని మొత్తం కక్కేస్తారు. అన్నం పెట్టిన ఇండస్ట్రీ అనే విశ్వాసం ఏమాత్రం కూడా ఉండదు వీరిలో.
అలా రష్మిక, రకుల్ ప్రీత్ సింగ్ మరియు పూజ హెగ్డే వంటి హీరోయిన్లు మన ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతూ ఎన్నో అన్నారు. వీరిపై సోషల్ మీడియా లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. పూజా హెగ్డే వంటి వారు నోరు జారినా, వారికి సౌత్ లో ఇంకా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉండడంతో, వివరణ ఇచ్చి మేము అలా అనలేదు, మా మాటలను ఇలా వక్రీకరించారు అని చెప్పారు, కానీ ఇక సౌత్ లో అవకాశాలు కష్టం అని అనుకున్న హీరోయిన్స్ మాత్రం చేసిన కామెంట్స్ కి వివరణ కూడా ఇవ్వడం లేదు.
అలాంటి హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది ప్రముఖ క్రేజీ స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా. ఈమె తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈమెకి టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో అవకాశాలు మెండుగా వచ్చాయి. కానీ ఈమధ్య ఈమె చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వడం తో టాలీవుడ్ కి దూరం అయ్యింది. ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వస్తుంది.
రీసెంట్ గా ఈమె బాలీవుడ్ లో చేసిన ఒక ఇంటర్వ్యూ లో సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమకి గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ ‘సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ కి ఎక్కువగా హీరోయిన్స్ బొద్దుగా ఉండాలి, అప్పుడే నచ్చుతారు’ అంటూ కామెంట్ చేసింది. ఈమె చేసిన కామెంట్స్ పై నెటిజెన్స్ మండిపడుతున్నారు.
నీకు జీవితాన్ని ఇచ్చింది మన సౌత్ ఇండస్ట్రీ, అలాంటి ఇండస్ట్రీ(Rashi Khanna Comments on Tollywood) మీద ఇలాంటి కామెంట్స్ చెయ్యడానికి సిగ్గు లేదా, మీరంతా ఇంతే, అవసరం తీరిపోయాక మమల్ని పట్టించుకోరు. మిమల్ని ప్రోత్సహిస్తున్న డైరెక్టర్స్ ని అనాలి ముందు అంటూ రెచ్చిపోయారు. మరి ఆమె మాట్లాడిన ఈ మాటలకు వివరణ ఇస్తుందో లేదో చూద్దాం.