Akkineni Family : ఈమధ్య సినిమా ఇండస్ట్రీలో మరణాలు మల్లి మొదలయ్యాయి. విజయ్ ఆంటోనీ కూతురు మరణం తో మొదలుపెడితే, ప్రొడ్యూసర్ దిల్ రాజు వాళ తండ్రి మరణం వరకు ఎన్నో బాధాకరమైన న్యూస్లు మనం వింటున్నాము. ఈసారి అక్కినేని కుటుంబం లో నుండి ఓ బాధాకరమైన వార్త వచ్చింది. అక్కినేని నాగేశ్వర రావు కూతురు(Akkineni Nagarjuna Sister Death) మరియు అక్కినేని నాగార్జున అక్క గారు అనారోగ్య సమస్యలతో తన తుది శ్వాస విడిచారు. ఈమె పేరు నాగ సరోజ. ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది.
నాగ సరోజ అక్కినేని నాగేశ్వర రావు దంపతుల మూడో సంతానం. వీరి తోడబుట్టిన వారు మొత్తం ఐదుగురు. నాగ సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్ మరియు నాగార్జున. వీరిలో సరోజ ఒక్కరే సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉండి చాలా సింపుల్ లైఫ్ ను లీడ్ చేసింది. నలుగురిలో సత్యవతి గారు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈమె హీరో సుమంత్ అమ్మగారు. మిగితా వాలు కొందరు అన్నపూర్ణ స్టూడియోస్ చూసుకుంటుంటే మరి కొందరు ప్రొడ్యూసర్లు గా వ్యవహరిస్తున్నారు.
అక్కినేని కుటుంబం నుండి నాగేశ్వర రావు తరువాత కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna Sister Death) తన తండ్రి లెగసీని తన భుజాలపై మోస్తుంటే, నాగేశ్వరరావు మనవాళ్ళు సుమంత్, సుశాంత్, నాగ చైతన్య మరియు అఖిల్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా నిలదొక్కుకోడానికి తమ కష్టం తాము పడుతున్నారు. ఇలా అక్కినేని కుటుంబం నుండి మూడు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీను నమ్ముకొని ఉన్నారు. అందుకే వీరికి అంత గౌరవం దక్కుతుంది.
ఇదిలా ఉంటె ప్రస్తుతం నాగ సరోజ మరణ వార్తా తో అక్కినేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ వార్త తెలిసిన అక్కినేని అభిమానులు ఆమె ఆత్మా కు శాంతి కలగాలని కామెంట్లు పెడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే, అక్కినేని కుటుంబం నుండి ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా అనౌన్స్ అవ్వలేదు.
నాగ చైతన్య మరియు అఖిల్ చేసిన సినిమాలు ఒకటి కూడా హిట్ కొట్టడం లేదు. వీరిద్దరూ ఓ మంచి బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరి అభిమానులు కూడా అక్కినేని కుటుంబం నుండి ఒక్క హిట్ కోరుకుంటున్నారు.