Saturday, September 21, 2024
HomeCinemaTeja Sajja : హనుమాన్ సినిమాతో టాప్ హీరోలు కూడా అందుకోలేని రికార్డును సృష్టించిన తేజ...

Teja Sajja : హనుమాన్ సినిమాతో టాప్ హీరోలు కూడా అందుకోలేని రికార్డును సృష్టించిన తేజ సజ్జ..

Teja Sajja New Record : ప్రస్తుతం ఎక్కడ చూసిన హనుమాన్ సినిమా జోరే కనిపిస్తుంది. ఈ సినిమాలో మన టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజ సజ్జ హీరోగా నటించాడు మరియు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. తేజ సజ్జ హీరోగా నటించిన మొదటి సినిమా జోంబీ రెడ్డి మంచి విజయం అందుకుంది. ఆ తరువాత తేజ హనుమాన్ సినిమా చేసాడు. ఇది మొట్టమొదటి సూపర్ హీరో పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాను సంక్రాతి కానుకగా విడుదల చేసారు చిత్ర యూనిట్.

teja-sajja-new-record-with-hanuman

హనుమాన్ తో ఈసారి పోటీపడ్డ సినిమాలు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, వెంకటేష్ నటించిన సైన్ధవః మరియు నాగార్జున నటించిన నా సామి రంగ. ఇలా స్టార్ హీరోల సినిమాలతో పోటీపడాడు యంగ్ హీరో తేజ సజ్జ మరియు అందరి సినిమాలకంటే తానూ నటించిన హనుమాన్ విజయవంతంగా మొదటి షో నుండి బ్లాక్ బస్టర్ పేరును సంపాదించుకుంది. ఇది తెలుగు సినిమా అయినప్పటికీ ఇండియా వైడ్ బారి విజయం సాధించి, తేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

teja-sajja-new-record-with-hanuman-movie

అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు పైన అవుతున్న ఇంకా సినిమా హాళ్లు ఫుల్ అవడం విశేషం. ఇదిలా ఉంటె తేజ నటించిన హనుమాన్ ఓ ట్రెండ్ మార్క్ సెట్ చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో మన సౌత్ సినిమా నార్త్ ఇండస్ట్రీలో 50 కోట్లు సంపాదించడం చాలా అరుదుగా చూస్తాము. వీటిలో టాప్ 5 పోసిషన్ లో ఒకటిగా ఉంది తేజ (Teja Sajja New Record) నటించిన హనుమాన్. ఇది తన కెరీర్ ను మార్చే సినిమా అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts