Sunday, October 6, 2024
HomeCinemaRam Charan : టాటూ వేయించుకున్న రామ్ చరణ్.. ఎక్కడ ఎవరి పేరు ?

Ram Charan : టాటూ వేయించుకున్న రామ్ చరణ్.. ఎక్కడ ఎవరి పేరు ?

Ram Charan Tattoo : చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన మొదటి సినిమా చిరుత తోనే సక్సెస్ అందుకున్నాడు. చిరంజీవి తనయుడు కావడంతో పూరి జగన్నాద్ ఆ సినిమా తీసేందుకు ఒప్పుకున్నారు. తన మొదటి సినిమాకే రామ్ చరణ్ ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తరువాత ఎన్నో సినిమాలు చేసి తన సత్త ఏంటో నిరూపించుకున్నాడు. రామ్ చరణ్ రాజమౌళి తో కలిసి చేసిన సినిమాలు మగధీర, RRR తన కెరీర్ లోనే అతి పెద్ద హిట్స్ అని చెప్పుకోవచ్చు.

రామ్ చరణ్ అపోలో హాస్పిటల్స్ మనవరాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇటీవలే తమ మొదటి సంతానం కలిగింది. పాపకు క్లిన్ కార అని నామకరణం చేసారు కుటుంబ సభ్యులు. పెళ్లయిన పది ఏళ్లకు పుట్టిన పాపా కావటంతో అందరికి క్లిన్ కార అంటే బాగా గారాబమే. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో కలిసి గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షెడ్యూల్ మొన్న పూర్తి అయ్యింది. ఇప్పుడు జాన్వీ కపూర్ తో కలిసి ఆర్సీ 16 సినిమా మొదలు పెట్టారు.

ram-charan-tattoo-on-chest

ప్రతి హీరోకి మనం టాటూస్ చూస్తూ ఉంటాము, కానీ రామ్ చరణ్ కి కూడా ఒక టాటూ ఉంది అని మీకు తెలుసా ? రామ్ చరణ్ ఇటీవలి తన చాతి పై ఒక టాటూ వేయించుకున్నారట. కూతురి క్లిన్ కార పేరు, ఉపాసన పేరు, రామ్ చరణ్ పేరు లోని మొదటి అక్షరాలూ KUC అని తన చాతి పై టాటూ వేయించుకున్నారు అని తెలుస్తుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts