మంచి ఫామిలీ సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకి దెగ్గర అయిన నటి సమంత. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన సమంత ఆ తరువాత ఎన్నో మంచి ఫామిలీ సినిమాల్లో నటించి టాలీవుడ్ కె నెంబర్ వన్ హీరోయిన్ అయింది. ఏమాయ చేసావే సినిమా సమయంలో ఇక అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడి 3-4 ఏళ్ళు కలిసి తిరిగి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయిన 4 ఏళ్లకే ఏవో కారణాల చేత విడిపోయారు.
ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి జీవితాలు వారూ విడివిడిగా గడుపుతున్నారు. ఇక సమంత నాగ చైతన్యను ప్రేమించక ముందు హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయణం నడిపిన విషయం మనం టీవీలో చూసాం. తాజాగా సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అదేంటి అంటే సమంత కి నాగ చైతన్య, సిద్ధార్థ్ కంటే ముందు మరో ప్రియుడు ఉండేవాడు అని.
తను చదువుకునే సమయంలో సామ్ వెంట ఒక రాజకీయా నాయకుడి కొడుకు తిరిగేవాడు అట. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటపడుతూ ప్రేమించమని వేదించే వాడు అట. ఇక ఒక రోజు సమంత కూడా తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియా లో ఈ వార్త తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ వార్తలో ఎంత నిజముందో తెలీదు ఎందుకంటే సమంత మీద ఇలాంటి వార్త సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి.