ఈ మధ్య మనం వార్తల్లో బాగా వింటున్న టాపిక్ ఫోన్ టాపింగ్. ప్రస్తుతం దీని గురించే అందరూ చర్చ, ఇప్పుడు ఫోన్ టాపింగ్ సినీ పరిశ్రమ కు చుట్టుకుంది. తెలంగాణాలో పొలిటిషన్స్ ఏ కాకుండా సెలబ్రిటీస్ కూడా ఈ చిక్కులో ఇరుక్కున్నారు. హీరో హీరోయిన్ లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవటానికి కూడా ఇదే కారణం అని తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది పోలీస్ అధికారులు అరెస్ట్ కూడా అయ్యారు.
మరికొంత మంది ఈ కేసుకు సంబందించిన అధికారులు ఇతర దేశాలు పారిపోయారు. ఈ విషయం పై నిర్మాత చిట్టి బాబు గారు స్పందించారు. కాంగ్రెస్ కావాలనే సినీ ఇండస్ట్రీని ఇందులోకి లాగుతుంది అని ఆయన మండి పడ్డారు. కాంగ్రెస్ కి ఎపుడు ఇలా చేయటం మామూలే అంటూ ఇది కేవలం కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని ఆయన తెలిపారు. నాగ చైతన్య సమంత విడిపోవటానికి కారణం ఈ ఫోన్ టాపింగ్ అంటూ తీన్ మార్ మల్లన్న చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం లేపుతున్నాయి.
వీటిపై చిట్టి బాబు స్పందిస్తూ సమంతకు గవర్నమెంట్ తో ఏదో పని ఉండి వారిని సంప్రదించి ఉండొచ్చు, అదే విధంగా రకుల్ కి కూడా ఏదో పని ఉండి మాట్లాడి ఉండొచ్చు అంత మాత్రానికె వారు వెళ్లి వారి మంచం మీద పడుకున్నట్ల, వీళ్లు వెళ్లి ఏమైనా లైట్ వేసి చూసారా అంటూ ఘాటుగా స్పందించాడు. ఇలాంటి చిల్లర బుడ్డి మార్చుకోవాలి అని కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎక్కిపడేశాడు.