అవును మీరు వినేది నిజమే. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. రణబీర్ కపూర్ – ఆలియా ఇద్దరు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరో మరియు హీరోయిన్లుగా ఉన్నారు. వీరిద్దరూ సినిమా బాక్గ్రౌండ్ నుండి వచ్చి తమ నటన నైపుణ్యం చూపించి ఎందరినో అభిమానులుగా మార్చుకున్నారు. వీరిద్దరి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల చేసారు. ఇలా వీరి కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రణబీర్ ఆలియాతో పెళ్ళికి ముందు ఎందరినో డేట్ చేసారు.
చివరికి ఆలియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ పెళ్లి తరువాత ఆనందంగా జీవిస్తున్నారు. వీరి ప్రేమకు చిహ్నాంగా ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం ఓ వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఆలియా మరియు రణబీర్ కపూర్ విడాకులు తీసుకుబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు అసలు కారణం ఓ స్టార్ హీరోయిన్ అంట. ఆ హీరోయిన్ మరెవరో కాదు సాయి పల్లవి.
డీసెంట్ గా ఉండే ఈ హీరోయిన్ రణబీర్ – ఆలియా విడాకులకు కారణం ఏంటి అని ఆలోచిస్తున్నారా. అదేంలేదు, సాయి పల్లవి తో నటించిన హీరోలకు విడాకులు అవుతున్నాయి. లవ్ స్టోరీ సినిమా తరువాత నాగ చైతన్య మరియు సామ్ కు విడాకులు అయ్యాయి. మారి సినిమా తరువాత ధనుష్ ఐశ్వర్యకు విడాకులు అయ్యాయి. దీనితో సాయి పల్లవి నెక్స్ట్ రణబీర్ కపూర్ తో నటిస్తుండడం వలన ఈ వార్తాలు గుప్పుమంటున్నాయి.