Sunday, October 6, 2024
HomeCinemaMrunal Thakur : ఆ హీరోలో నేను ఆ పార్టు చూస్తా.. మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యలు...

Mrunal Thakur : ఆ హీరోలో నేను ఆ పార్టు చూస్తా.. మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యలు వైరల్..

Mrunal Thakur : ఈ రోజుల్లో టాలీవుడ్ పరిశ్రమలో మృణాల్ ఠాకూర్ చాలా పాపులర్ పేరు. అంతేకాదు టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు మారుమోగిపోవడం. ఈ మధ్య పలు సినిమాలతో బిజీగా ఉన్నది ఈ భామ. అయితే, ఆమె చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ, ఆమెతో సినిమాలు చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. హాయ్ నాన్న సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న మృణాల్ ఠాకూర్, ఫామిలీ స్టార్ చిత్రంతో ప్లాప్ అందుకుంది.

అయితే ప్రస్తుతం ఆమె మూడు తెలుగు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌లో మీకు ఇష్టమైన పాత్ర ఎవరు అని హోస్ట్ అడిగారు. ఈ క్ర మంలో ప్రజలు కూడా తమ నోటి నుంచి ఆ పేరు వస్తుందని ఎక్కువ సేపు ఎదురుచూశారు. సాధారణంగా ప్రతి హీరో, హీరోయిన్లకు ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఉంటారు. ఓ సెలబ్రిటీ స్టార్ ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో ఎక్కువ ఉంటుంది. తాజాగా తన ఫేవరెట్ హీరో ఎవరో ప్రకటించారు.

mrunal-thakur-comments-on-favourite-hero

“నా ఫేవరెట్ హీరో షాహిద్ కపూర్. జెర్సీ సినిమా చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు దొరికిన ప్రతిసారీ అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. నిజానికి షాహిద్ కపూర్ కోసం ప్రత్యేకంగా ఈ సినిమా చేశాను. అతను కనిపించినప్పుడు, నేను అక్కడే ఉండి నవ్వుతూ చూడగలను. అతను నవ్వితే చాలా బాగుంటుంది. అతని చిరునవ్వు నాకు చాలా ఇష్టం” అని చెప్పింది. మృణాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts