Darshanam Mogilaiah : మన దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా అనేక ప్రాచీన కళలు మరియు జానపద గేయాలు ఉన్నాయని, వాటిని మన భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో ఇలాంటి ఓ ప్రాచీనమైన కిన్నెర కళ ఒకటి ఉంది అని అందరికీ గుర్తుచేశారు. ఇలా చేయడం వలన ఈ కళలు ఇంకా బలపడుతాయి. బీమ్లా నాయక్ సినిమాలో కిన్నెర వాణిద్యుడు దర్శనం మొగిలయ్య గొప్ప కీర్తిని సాధించారు మరియు
పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. అయితే ఇప్పుడు ఆయినా పరిస్థితి అల్సలెం బాలేదని వాతలు వస్తున్నాయి. పద్మశ్రీ గ్రహీత అయినా మొగిలయ్య గారిని ఇలా చూడటం చాలా బాధాకరం. ఇటీవలి నివేదికల ప్రకారం, కిన్నెర ముమొగలయ్య ప్రస్తుతం డబ్బుల ఇబంది వాలని రోజువారీ కూలీ గా పని చేస్తున్నారట. ఈయనకు ఇంతకుముందు ప్రభుత్వంలో అండ్ 10 వేళా రూబుల పెన్షన్ కూడా ఇప్పుడు అందడంలేదని తెలుస్తుంది.
తన 9 మంది పిల్లల్లో ఒక కొడుకు మందుల కోసమే నెలకు 7000 రూపాయలు కావాలి అందుకే ఈ పని చేస్తున్నానన్నాడు. 73 ఏళ్ల వయసులో ఆయన ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నారని తెలిసి అందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన తెలంగాణ ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు సుచేత గారు అంటూ ఆమె పెట్టిన పోస్ట్ కు స్పందించాడు. ఈ కేసును తానే స్వయంగా తీసుకుని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.