Renu Desai : రేణు దేశాయ్ తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. ఈమె బద్రి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఈ సినిమాలో ఈమె పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించింది. బద్రి సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రేణు దేశాయ్ మరియు పవన్ కళ్యాణ్ ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు కలిసి జీవించారు. వీరికి ఇద్దరు సంతానం కూడా కలిగింది. వీరి విడాకులు తరువాత రేణు దేశాయ్ పేరు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది.
రేణు దేశాయ్ తనదైన స్టైల్ లో మాజీ భారత పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. అలా చేయడంతో పవన్ అభిమానులు రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఈమె పవన్ గురించి ఎం మాట్లాడిన సరే దాని తప్పుగా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇలా ఎన్నోసార్లు ట్రోలింగ్ కు గురైంది రేణు దేశాయ్. అయితే ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె పవన్ కళ్యాణ్ గురించి రిపోర్టర్ అడగగానే ఫైర్ అయింది.
ఆ రిపోర్టర్ ను ఏకిపారేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రతి బంధానికి సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు సంతోషంగా ఉంటారు, మరి కొన్ని సార్లు ఏడుస్తూ ఉంటారు. నా జీవితం కూడా అలాగే ఉంది అని ఆవిడా అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్ ఉంది పవన్ కళ్యాణ్ గురించి అడుగుతాడు. దానికి ఈవిడ ఇలా సమాధానం ఇచ్చింది. నన్ను ఏమీ అడగవద్దు ఎందుకంటే నేను ఆయన గురించి ఏం మాట్లాడినా తప్పుగా రాస్తారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.