Sunday, July 7, 2024
HomeCinemaThaman : రామ్ చరణ్ గేమ్ చెంజర్ పై కామెంట్ చేసిన తమన్.. ఏమన్నాడంటే..

Thaman : రామ్ చరణ్ గేమ్ చెంజర్ పై కామెంట్ చేసిన తమన్.. ఏమన్నాడంటే..

Thaman : రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే ప్రతిష్టాత్మకమైన సినిమాను చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా రాజకీయ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటించారు. మెగా అభిమానుల్లో ఈ సినిమాపై బారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ సింగిల్ తప్ప ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి అప్ డేట్ ఏమీ లేదు.

విడుదలైన ఫస్ట్ సింగిల్ కూడా అంతంత మాత్రమే ఉంది. అయితే ఈ సినిమాకు పనిచేసిన వారు తమ అనుభవాల గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు తమన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. గేమ్ ఛేంజర్ పాటలు కాకుండా, ప్రతి ఇతర అంశం హైలైట్ అవుతుంది మరియు శంకర్ చాలా కాలం తర్వాత తన ట్రేడ్ మార్క్ సినిమాతో మనముందుకు వస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు.

thaman-about-ram-charan-game-changer-cinema

తప్పకుండా విడుదల తరువాత అభిమానులు పెద్ద వేడుకలు చేసుకుంటారు అంటూ ఆయన గట్టిగా చెప్పారు. ఇక తమన్ వ్యాఖ్యలు గేమ్ ఛేంజర్‌పై అభిమానుల ఆసక్తిని మళ్లీ పెంచింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య తదితరులు కనిపించనుండగా, దిల్ రాజు తన బ్యానర్‌లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాతికి మన ముందుకు రాబోతుంది. గేమ్ చెంజర్ సినిమా మంచి విజయం సాధించి రామ్ చరణ్ ఖ్యాతిని మరింత పెంచాలని కోరుకుంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts