Hema : నటి హేమ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా మారుమోగిపోతుందో మన అందరికి తెలుసు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, హేమ నిన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ రోల్స్ చేసే నటిగా మాత్రమే గుర్తింపు పొందింది. కానీ మొన్న జరిగిన రేవ్ పార్టీ బస్ట్‌లో ఆమె పేరు వినిపించడంతో ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. నటి మాత్రం తానూ రేవ్ పార్టీకి వెళ్లలేదు అని చాలా నమ్మకంతో చెపుతోంది. ఆమె పార్టీలో ఉన్నట్లు సాక్షాలతో పాటు కన్నడ పోలీసులు బయటపెట్టారు.
పోలీసులు చెప్పే దాని బట్టి చూస్తే హేమ తన రు కృష్ణవేణిగా చెప్పింది. కానీ ఈమె మాత్రం అది నేను కాదు అని అదరగొడుతుంది. ఈ అంశంపై ఇంకా గందరగోళం నెలకొంది. దీంతో పాటు హేమకు సంబంధించిన పలు పాత వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి హేమ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి ఓపెన్‌గా మాట్లాడింది. నా భర్త కెమెరామెన్, మా అమ్మ కూడా ధనవంతురాలు. మా గ్రామంలో దేనికీ లోటు లేదు. నాకు చాలా ఆస్తి ఉంది.
నేను సినిమా పరిశ్రమలో పనిచేయడమే కాదు, కిట్టి పార్టీల ద్వారా కూడా బాగా డబ్బు సంపాదిస్తాను. జీవితంలో స్థిరపడేందుకు నా దగ్గర తగినంత డబ్బు ఉంది. దీనితో నాకు ఎలాంటి సమస్య లేదు. హేమ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ అవ్వడంతో హేమ నిజాయతీపరురాలు అని కొందరంటే, మరికొందరు ఆమెకు ఇంత ఆస్తి ఉందని సరదాగా గడిపేందుకు బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్లారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.